కేరళలో ఏనుగు మృతిపై కేంద్ర స్థాయిలో దర్యాప్తు.. మంత్రి ప్రకాష్ జవదేకర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 12:21 PM

కేరళలో గర్భస్థ ఏనుగు మృతి దేశవ్యాప్త సంచలనమైంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందని మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. దీనిని ప్రభుత్వం..

కేరళలో ఏనుగు మృతిపై కేంద్ర స్థాయిలో దర్యాప్తు.. మంత్రి ప్రకాష్ జవదేకర్
Follow us on

కేరళలో గర్భస్థ ఏనుగు మృతి దేశవ్యాప్త సంచలనమైంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందని మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏనుగు మరణానికి కారకులైన నేరగాళ్ళను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతాయని ఆయన చెప్పారు. క్రాకర్స్ ని ‘ఆహారం’ గా పెట్టి ఒక ప్రాణిని చంపడం భారతీయ సంస్కృతి కాదని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటన మళప్పురం  లో జరిగిందని వార్తలు వఛ్చినప్పటికీ.. పలక్కాడ్ జిల్లాలో జరిగినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ జిల్లాలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ సమీపంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఈ ఏనుగుకు స్థానికులు కొందరు టపాకాయలు కూర్చిన పైన్ యాపిల్ పెట్టడంతో అది తిని గజరాజం మృతి చెందింది. గతమే 27 న నదిలోకి దిగడానికి ముందు ఈ ఏనుగు కాలిన గాయం బాధతోనే గ్రామమంతా తిరిగినట్టు వెల్లడైంది. కాగా పలక్కాడ్ జిల్లాకు పక్కనే ఉన్న మరో జిల్లాలో కూడా ఓ ఆడ ఏనుగు కూడా తీవ్రమైన నోటి గాయంతో అల్లాడిందని, దాని కాలి మడమలు విరిగి ఉన్నాయని, చివరకు అది మరణించిందని కొందరు అధికారులు తెలిపారు.