చేతి శానిటైజర్లలో ‘మంచివీ’…’మామూలువీ’!

| Edited By: Anil kumar poka

Mar 16, 2020 | 12:34 PM

కరోనా వైరస్ నివారణకు వాడే హ్యాండ్ శానిటైజర్లు ప్రపంచ వ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.  కరోనా వ్యాధికి కారణమయ్యే మైక్రోబ్స్ ని ఇవి నాశనం చేస్తాయి. అసలు, సబ్బు, నీరు లేనప్పుడు ఈ శానిటైజర్లను విధిగా వాడవలసిందే..

చేతి శానిటైజర్లలో మంచివీ...మామూలువీ!
Follow us on

కరోనా వైరస్ నివారణకు వాడే హ్యాండ్ శానిటైజర్లు ప్రపంచ వ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.  కరోనా వ్యాధికి కారణమయ్యే మైక్రోబ్స్ ని ఇవి నాశనం చేస్తాయి. అసలు, సబ్బు, నీరు లేనప్పుడు ఈ శానిటైజర్లను విధిగా వాడవలసిందే.. అయితే వీటిలో రెండు రకాలున్నాయట. ఆల్కహాలుతో కూడినవి ఒకరకమైతే.. ఆల్కహాలు లేనివి రెండో రకం. ఆల్కహాలుతో కూడినవాటిలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, ఈథనాల్, లేదా ఎన్. ప్రాపనాల్ ఉంటాయి. ఈ టైపు శానిటైజర్లు వివిధ రకాల బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. రైనోవైరస్, హెపటైటిస్ వైరస్, ఇన్ ఫ్లుయెంజా వైరస్ తదితర వైరస్ లను ఇవి నశింపజేయగలుగుతాయి. కొన్ని వైరస్ ల చుట్టూ ఉండే ఎన్ వెలప్ ప్రోటీన్ ను ఇవి దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్కహాలు కంటెంట్ తక్కువ ఉండే శానిటైజర్లు ఈ టైపు వాటికన్నా అత్యంత సాధారణమైనవని, కొన్ని వైరస్ లను ఇవి నాశనం చేయజాలవని వారంటున్నారు. ఏమైనా సబ్బు, నీటితో తరచూ చేతులు శుభ్రపరచుకోవడమే మేలని అంటున్నారు.