‘చప్పట్లు కొడితే ఏం లాభం’? మోదీపై రాహుల్ ధ్వజం

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2020 | 5:38 PM

కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారుతోందని, ఈ కారణంగా మొదట ఎకానమీని తక్షణమే పునరుధ్ధరించడానికి భారీ ఆర్ధిక ప్యాకేజీకి అనువైన చర్యలు ప్రభుత్వం  తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు.’అసలే క్షీణిస్తున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఈ కరోనా ‘దాడి’ చేసింది. ఈ వైరస్ ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నవారి గౌరవార్థం చప్పట్లు కొట్టాలని ప్రధాని మోడీ ఇఛ్చిన పిలుపు అర్థ రహితం ‘ అని ఆయన అపహాస్యం చేశారు. […]

చప్పట్లు కొడితే ఏం లాభం? మోదీపై రాహుల్ ధ్వజం
Follow us on

కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారుతోందని, ఈ కారణంగా మొదట ఎకానమీని తక్షణమే పునరుధ్ధరించడానికి భారీ ఆర్ధిక ప్యాకేజీకి అనువైన చర్యలు ప్రభుత్వం  తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు.’అసలే క్షీణిస్తున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఈ కరోనా ‘దాడి’ చేసింది. ఈ వైరస్ ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నవారి గౌరవార్థం చప్పట్లు కొట్టాలని ప్రధాని మోడీ ఇఛ్చిన పిలుపు అర్థ రహితం ‘ అని ఆయన అపహాస్యం చేశారు. చప్పట్లు కొట్టినంత మాత్రాన రోజువారీ వర్కర్లకు, చిన్న, మధ్య తరహా పారిశ్రామికులకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని, వారికి చప్పట్లు ఎలాంటి సాయం చేయబోవని రాహుల్ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మనకు కావలసింది భారీ ఆర్ధిక ప్యాకేజీ.. పన్నుల్లో మినహాయింపులు, అలాగే  రుణాల తిరిగి చెల్లింపులో రిలీఫ్ (రాయితీలు) కూడా ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.

అయితే… కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు కృషి చేస్తున్నవారికి,  ఈ వ్యాధి సోకిన రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ వారి గౌరవ సూచకంగా ప్రజలంతా ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపునిచ్చిన  సంగతి తెలిసిందే.