అవిశ్వాస తీర్మానం పెడతారా ? పెట్టండి ! కాంగ్రెస్ పార్టీకి ఎడ్యూరప్ప సవాల్

| Edited By: Anil kumar poka

Sep 26, 2020 | 1:47 PM

కర్నాటకలో సీఎం ఎడ్యూరప్ప  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను ఆయన (ఎడ్యూరప్ప) సవాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శనివారం..

అవిశ్వాస తీర్మానం పెడతారా ? పెట్టండి ! కాంగ్రెస్ పార్టీకి ఎడ్యూరప్ప సవాల్
Follow us on

కర్నాటకలో సీఎం ఎడ్యూరప్ప  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను ఆయన (ఎడ్యూరప్ప) సవాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శనివారం..విపక్ష నేత, మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. కరోనా పేరిట ఈ రాష్ట్రంలో 2 వేల కోట్ల అవినీతి జరిగిందని, ప్రతి రోజూ కరోనా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.  ప్రజల విశ్వాసం కోల్పోతున్న ఈ సర్కార్ పై అవిశ్వాస తీర్మానానికి  నోటీసునిస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఈ ప్రతిపాదనను రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ కొట్టిపారేసింది. మీకు అసలు సభలో మెజారిటీయే లేదని ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మీది రాజకీయ దురుద్దేశమన్నారు.  కాగా-225 మంది సభ్యులున్న రాష్ట్ర శాసన సభలో బీజేపీ సభ్యులు 116 మంది ఉండగా, కాంగ్రెస్ వారు 67 మంది ఉన్నారు. జనతాదళ్ సెక్యులర్ 33 మంది, బీఎస్పీ, స్వతంత్ర సభ్యులు కొంతమంది ఉన్నారు. వీరిలో పలువురు బీజేపీకి మద్దతునిస్తున్నారు.