ఢిల్లీలో కోవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్స్ అతికించరట !

| Edited By: Anil kumar poka

Oct 09, 2020 | 1:55 PM

ఢిల్లీలో హోం ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగుల ఇళ్ల బయట ఇక పోస్టర్స్ ఉండబోవని అధికారులు ప్రకటించారు. 'కోవిడ్-19 డు నాట్ విజిట్ హోం అండర్ క్వారంటైన్' అని రాసి ఉన్న పోస్టర్లను ఇప్పటివరకూ అతికించేవారు.

ఢిల్లీలో కోవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్స్ అతికించరట !
Follow us on

ఢిల్లీలో హోం ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగుల ఇళ్ల బయట ఇక పోస్టర్స్ ఉండబోవని అధికారులు ప్రకటించారు. ‘కోవిడ్-19 డు నాట్ విజిట్ హోం అండర్ క్వారంటైన్’ అని రాసి ఉన్న పోస్టర్లను ఇప్పటివరకూ అతికించేవారు. కానీ ఈ పద్దతికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధమైన పోస్టర్లను అతికించడం వల్ల సంబంధిత రోగుల ఐడెంటిటీని దాదాపుపేరు పెట్టి మరీ చూపించినట్టు అవుతుందని, వారిని ఒక రకంగా బాధ పెట్టినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో సుమారు 13 వేలమంది కోవిద్ రోగులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. స్వల్ప కరోనా వైరస్ లక్షణాలున్నవారిని, ఎ సింప్టొమాటిక్ కేసు వ్యక్తులను స్వీయ నియంత్రణలో ఉంచాలన్నది ప్రభుత్వ పాలసీ.. ఇటీవలివరకు ఇలాంటి పోస్టర్స్ ను వీరి ఇళ్ల బయట తలుపులపైనో, గోడల పైనో అతికించేవారు.  దీనికి స్వస్తి చెబుతున్నారు.