NITI Aayog: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన నీతి ఆయోగ్.. నిధులు వినియోగించుకోలేదంటూ..

|

Aug 06, 2022 | 7:45 PM

NITI Aayog: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై నీతిఆయోగ్‌ స్పందించింది. ఆదివారం జరిగే సమావేశానికి కేసీఆర్‌ రాకపోవడం దురదృష్టకరమని..

NITI Aayog: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన నీతి ఆయోగ్.. నిధులు వినియోగించుకోలేదంటూ..
Niti Aayog
Follow us on

NITI Aayog: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై నీతిఆయోగ్‌ స్పందించింది. ఆదివారం జరిగే సమావేశానికి కేసీఆర్‌ రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. సమాఖ్యస్ఫూర్తి తోనే నీతిఆయోగ్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది. దేశాభివృద్ది కోసం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని తెలిపింది. గతంలో 30 సార్లు వివిధ రాష్ట్రాలతో సమావేశమయ్యాయని, రాష్ట్రాల సమస్యలకు ప్రధాని మోదీ నేతృత్వంలో పరిష్కారం చూపించాయని స్పష్టం చేసింది. గత ఏడాది జనవరిలో నీతిఆయోగ్‌ బృందం స్వయంగా తెలంగాణ సీఎంతో సమావేశమైనట్టు వివరణ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ సీఎంతో సమావేశం కావడానికి ప్రయత్నించినప్పటికి, స్పందించలేదని తెలిపింది. నాలుగేళ్లలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణకు రూ.3982 కోట్లు కేటాయిస్తే రూ.200 కోట్ల మాత్రమే డ్రా చేశారని తప్పుపట్టింది. అయినప్పటికి 2014-2015 , 2021-22 మధ్య తెలంగాణకు PMKSY-AIBP-CADWM పథకం కింద రూ.1195 కోట్లు కేటాయించినట్టు వివరణ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..