ఒకేసారి నిర్భయ దోషుల ఉరి ? వారం రోజులే వారికి వ్యవధి ?

| Edited By: Pardhasaradhi Peri

Feb 05, 2020 | 4:41 PM

నిర్భయ దోషులు తమకు న్యాయపరంగా గల హక్కులను వినియోగించుకోవడానికి వారికి  ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది. ఈ గడువు ముగిసిన తరువాత.. వారి ఉరికి సంబంధించి విచారణ ప్రక్రియను ట్రయల్ కోర్టు ప్రారంభిస్తుందని కోర్టు పేర్కొంది.  వీరి ఉరిశిక్షపై పటియాలా  హౌస్ కోర్టు స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను పరిష్కరించిన హైకోర్టు.. వీరిని వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్ర అభ్యర్థనను తోసిపుచ్చింది. ఒక దోషి మెర్సీ పిటిషన్ పెండింగులో […]

ఒకేసారి నిర్భయ దోషుల ఉరి ? వారం రోజులే వారికి వ్యవధి ?
Follow us on

నిర్భయ దోషులు తమకు న్యాయపరంగా గల హక్కులను వినియోగించుకోవడానికి వారికి  ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది. ఈ గడువు ముగిసిన తరువాత.. వారి ఉరికి సంబంధించి విచారణ ప్రక్రియను ట్రయల్ కోర్టు ప్రారంభిస్తుందని కోర్టు పేర్కొంది.  వీరి ఉరిశిక్షపై పటియాలా  హౌస్ కోర్టు స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను పరిష్కరించిన హైకోర్టు.. వీరిని వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్ర అభ్యర్థనను తోసిపుచ్చింది. ఒక దోషి మెర్సీ పిటిషన్ పెండింగులో ఉన్నప్పుడు ఇతర దోషులను ఉరి తీయవచ్ఛునని ఢిల్లీ తీహార్ జైలు నిబంధనలు చెప్పడంలేదని జస్టిస్ సురేష్ కైత్ వ్యాఖ్యానించారు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది గనుక.. ఈ దోషులకు సంబంధించిన శిక్ష ఉమ్మడి తీర్పునకు లోబడి ఉంటుందని, అందువల్ల దోషులందరి డెత్ వారెంట్లు ఒకేసారి జారీ చేయాల్సి ఉంటుంది గానీ.. వేర్వేరుగా కాదని ఆయన స్పష్టం చేశారు.

తమ ఉరిని తప్పించుకునేందుకు ఈ నలుగురు దోషులు ఒక్కటై చట్టంలోని అన్ని లొసుగులనూ ఉపయోగించుకుంటున్నారని, ఈ దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఇలా జాప్యం జరుగుతూ పోతే.. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయిన ఇద్దరు దోషులను మొదట ఉరి తీయాలని ఆయన కోరారు. కాగా-విచారణ ప్రక్రియకు కోర్టు ఒక కాలబధ్ధ వ్యవధిని నిర్ణయించడం పట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దోషులు జాప్యం చేస్తూ వచ్చారని. కానీ ఇక వారం రోజుల్లోగా విచారణ ప్రక్రియ మొదలవుతుంది గనుక ఇక దోషులకు శిక్ష మళ్ళీ వాయిదా పడబోదని విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు.