Nirbhaya Case : నిర్భయ దోషులకు మళ్ళీ డెత్ వారెంట్లు.. ఈ సారైనా ఉరి తీస్తారా ?

| Edited By: Pardhasaradhi Peri

Feb 17, 2020 | 5:10 PM

Nirbhaya Case :  నిర్భయ దోషులను  మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. వారికి కోర్టు డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడో సారి. ముగ్గురు దోషుల లీగల్ ఆప్షన్లు అన్నీ మూసుకుపోయాయని, ప్రస్తుతానికి ఏ కోర్టులోనూ వీరి అపీళ్ళు పెండింగులో లేవని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం ఈ ఆదేశాల్ని జారీ చేసింది. అయితే దోషి పవన్ గుప్తా […]

Nirbhaya Case : నిర్భయ దోషులకు మళ్ళీ డెత్ వారెంట్లు.. ఈ సారైనా ఉరి తీస్తారా ?
Follow us on

Nirbhaya Case :  నిర్భయ దోషులను  మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. వారికి కోర్టు డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడో సారి. ముగ్గురు దోషుల లీగల్ ఆప్షన్లు అన్నీ మూసుకుపోయాయని, ప్రస్తుతానికి ఏ కోర్టులోనూ వీరి అపీళ్ళు పెండింగులో లేవని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం ఈ ఆదేశాల్ని జారీ చేసింది. అయితే దోషి పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో దోషి వినయ్ శర్మ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడని, ఇతనితో బాటు ఇతర దోషులకు న్యాయ ప్రక్రియ కవాటాలు తెరిచే ఉన్నాయని  వినయ్ తరఫు లాయర్ ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. అతడు మానసిక ఆందోళనతో ఉన్నాడని కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు-తన న్యాయవాది వృందా గ్రోవర్ ని తాను వదులుకున్నానని  ముకేశ్ అన్నాడు. దీంతో అతని తరఫున వాదించేందుకు రవి కాజీ అనే న్యాయవాదిని కోర్టు నియమించింది. ఇక పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టులోనూ, క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి వద్ద దాఖలు చేయాలనుకుంటున్నాడని అతని తరఫు లాయర్ తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ అయినా వారి తరఫు లాయర్లు వారి ఉరిని జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జైల్లో అధికారులు తనను టార్చర్ పెట్టినందుకు తాను  మానసికంగా అనుభవించిన ఆందోళనను రాష్ట్రపతి పట్టించుకున్నట్టు కనబడలేదని వినయ్ శర్మ అన్నాడు. కానీ..  మెంటల్ గా ఈ దోషి బాగానే ఉన్నాడని చూపే ఈ నెల 12 నాటి మెడికల్ రిపోర్టును కేంద్రం కోర్టుకు సమర్పించింది. ఇలా ఉండగా.. ఈ కోర్టు న్యాయమూర్తి దోషులకు మద్దతునిస్తున్నారని నిర్భయ తండ్రి  పేర్కొన్నారు. దోషులను శిక్షించాలన్న ఉద్దేశం కోర్టుకు ఉన్నట్టు కనబడడం లేదని ఆయన అన్నారు. దోషులు తమ శిక్షను జాప్యం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ   వినియోగించుకుంటున్నారని నిర్భయ తల్లి అన్నారు. కాగా-దోషుల ఉరి శిక్షకు సంబంధించి కొత్త తేదీని అదనపు  సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ప్రకటించారు.