ఇండియాకు చేరిన జువెల్లరీ ! నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఆటకట్టేనా ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 10, 2020 | 7:48 PM

వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని అంకుల్ మెహుల్ చోక్సీ ఆట కట్టేనని భావిస్తున్నారు. వారికి చెందిన రూ. 1350 కోట్ల విలువైన జువెల్లరీని  ఈడీ అధికారులు ముంబైకి తరలించారు...

ఇండియాకు చేరిన జువెల్లరీ ! నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఆటకట్టేనా ?
Follow us on

వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని అంకుల్ మెహుల్ చోక్సీ ఆట కట్టేనని భావిస్తున్నారు. వారికి చెందిన రూ. 1350 కోట్ల విలువైన జువెల్లరీని  ఈడీ అధికారులు ముంబైకి తరలించారు. సుమారు 2,340 కేజీలకు పైగా గల పాలిష్డ్ డైమండ్స్, బంగారు నగలు, ముత్యాలు, రత్నాలతో కూడిన  మొత్తం 108 ప్యాకేజీలను ఈడీ తిరిగి తీసుకురాగలిగింది. హాంకాంగ్ నుంచి వీటిని దుబాయ్ కి తరలించేందుకు వీరిద్దరూ ప్లాన్ వేశారని తెలిసింది. ఈడీ విచారణను తప్పించుకోవడానికి వీరిద్దరూ ఈ ఎత్తుగడ పన్నారని, అయితే ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలతో ఈడీ అధికారులు వారి ప్రయత్నాలను వమ్ము చేశారని తెలుస్తోంది. ఈ భారీ షిప్ మెంట్ మొత్తానికి భారత్ చేరింది. దీన్ని ఇండియాకు దిగుమతి చేసుకోవడానికి అధికారులు హాంకాంగ్ ను ఒప్పించవలసి వచ్చింది. ఈ ప్యాకేజీలలో 32 నీరవ్ మోదీకి, 76 ప్యాకేజీలు మెహుల్ చోక్సీకి చెందినవి.

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ లో నిందితులైన వీరు…. 2018 లో .. తమపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం కాగానే విదేశాలకు చెక్కేశారు. నీరవ్ మోదీని గత ఏడాది లండన్ లో అరెస్టు చేశారు. అయితే జైలు నుంచి అతడ్ని భారత్ కి అప్పగించాల్సి ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ వీరిపై దర్యాప్తు ప్రారంభించిన సంగతి విదితమే.