మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ కుమారుడి అన్వేషణ.. అతి చిన్న కొత్త జాతి బల్లి

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 1:42 PM

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కుమారుడు తేజాస్ థాక్రే ఇటీవల కర్ణాటక లోని సక్లేశ్వర్ ప్రాంతంలో ఓ కొత్త జాతి బల్లిని కనుగొన్నారు. నెమాస్పిస్ అనే జాతికి చెందిన ఈ బల్లి గురించి ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదట..

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ కుమారుడి అన్వేషణ.. అతి చిన్న కొత్త జాతి బల్లి
Follow us on

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కుమారుడు తేజాస్ థాక్రే ఇటీవల కర్ణాటక లోని సక్లేశ్వర్ ప్రాంతంలో ఓ కొత్త జాతి బల్లిని కనుగొన్నారు. నెమాస్పిస్ అనే జాతికి చెందిన ఈ బల్లి గురించి ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదట.. కాళ్ళ కింద ఉన్న మందపు పొరల సాయంతో.. ఈ జీవి.. అతి చదునైన,, స్మూత్ ప్రదేశాలను, ఏ మాత్రం పట్టు చిక్కని …ఎత్తయిన  చోట్లను కూడా ఎక్కగలదని అంటున్నారు. దీన్ని డ్వార్ఫ్ గెకో అంటారని, ఇతర జాతి బల్లులకన్నా దీని శరీరాకృతి భిన్నంగా ఉంటుందని తేజాస్ థాక్రే తెలిపారు. అయితే ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఈ విధమైన అన్వేషణను సాగించడం విశేషమే అంటున్నారు. సాధారణంగా రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు తమ తండ్రుల మాదిరే పాలిటిక్స్ లో చురుకుగా ఉంటారు. కానీ తన రూటే వేరన్నట్టు తేజాస్ ఇలా కర్ణాటకలోని కొండ  ప్రాంతాల్లో సరికొత్త ప్రాణుల గురించి తెలుసుకోవడానికి అన్వేషణ జరపడం గమనార్హం.