నేపాల్ పొలిటికల్ మ్యాప్ లో భారత భూభాగాలు !

| Edited By: Pardhasaradhi Peri

May 31, 2020 | 7:00 PM

నేపాల్ తమ పొలిటికల్ మ్యాప్ ను అప్ డేట్ చేసేందుకు  ప్రయత్నాలను  ముమ్మరం చేసింది. భారత్ తమ భూభాగాలని చెప్పుకునే ప్రాంతాలను కూడా ఈ మ్యాప్ లో చేర్చి తమవిగా చూపేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు పాలక లెఫ్ట్ అలయెన్స్ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించింది. సవరణ బిల్లుకు అనుకూలంగా తాము ఓటు చేస్తామని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ప్రకటించింది. సాధారణంగా ఆ దేశంలో ఓ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు నెల రోజులు పడుతుంది. […]

నేపాల్ పొలిటికల్ మ్యాప్ లో భారత భూభాగాలు !
Follow us on

నేపాల్ తమ పొలిటికల్ మ్యాప్ ను అప్ డేట్ చేసేందుకు  ప్రయత్నాలను  ముమ్మరం చేసింది. భారత్ తమ భూభాగాలని చెప్పుకునే ప్రాంతాలను కూడా ఈ మ్యాప్ లో చేర్చి తమవిగా చూపేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు పాలక లెఫ్ట్ అలయెన్స్ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించింది. సవరణ బిల్లుకు అనుకూలంగా తాము ఓటు చేస్తామని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ప్రకటించింది. సాధారణంగా ఆ దేశంలో ఓ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు నెల రోజులు పడుతుంది. అయితే ప్రజల సెంటిమెంటును దృష్టిలోకి తీసుకుని పార్లమెంటు అన్ని ప్రొసీజర్లనూ పక్కన పెట్టి…. రానున్న పది రోజుల్లో బిల్లు ఆమోదం పొందేలా చూస్తుందని తెలుస్తోంది. ఇది ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల సభ్యుల మెజారిటీ అవసరం. కానీ…. ఆల్రెడీ విపక్షం ఓకె చెప్పింది గనుక ఈ బిల్లు సభ ఆమోదం పొందడానికి పెద్ద కష్టమేమీ లేదు.

ఇక నేపాల్ చర్యలను భారత్ ఖండించింది. ఇలాంటి కృత్రిమ ‘విస్తరణ వాదాలను’ ఇండియా అంగీకరించబోదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అంటున్నారు. భారత ప్రభుత్వ వైఖరి గురించి నేపాల్ కు బాగా తెలుసునని, ఈ విధమైన అనుచిత పనులకు ఆ దేశం దిగకుండా ఉంటుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.