సుశాంత్ కేసులో ఎందుకింత అత్యుత్సాహం ? శరద్ పవార్

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2020 | 3:19 PM

సుశాంత్ సింగ్ కేసులో దేశం ఎందుకింత అత్యుత్సాహం చూపుతోందని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ప్రశ్నించారు. దేశంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఏ సూసైడ్ అయినా విచారకరమేనని..

సుశాంత్ కేసులో ఎందుకింత అత్యుత్సాహం ? శరద్ పవార్
Follow us on

సుశాంత్ సింగ్ కేసులో దేశం ఎందుకింత అత్యుత్సాహం చూపుతోందని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ప్రశ్నించారు. దేశంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఏ సూసైడ్ అయినా విచారకరమేనని ఆయన అన్నారు. కానీ ఈ ఒక్క కేసులోనే యావత్ దేశం ఇంత ఉత్సుకత చూపడం ఏమిటన్నారు. సుశాంత్ కేసు నేపథ్యంలో శివసేన  ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య రాజకీయ రగడ రేగగా, పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సుశాంత్ సూసైడ్ వ్యవహారాన్ని ఆయన కుటుంబ తగాదాగా అభివర్ణిస్తున్నారు. తన మేనల్లుడు అజిత్ పవార్ కుమారుడు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలన్న బీజేపీ డిమాండును సమర్థించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.