మహిళా ! మేలుకో ! ఉమెన్స్ డే నాడు చెన్నైలో మెరిసిన లేడీ సూపర్ స్టార్

| Edited By: Anil kumar poka

Mar 08, 2020 | 1:30 PM

సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్లకు, ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సారి మాత్రం తన ఈ ‘సంప్రదాయానికి ‘స్వస్తి’ పలికింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరైంది. ఆదాయం పన్ను శాఖ, ఓ సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా నగరంలో  నిర్వహించిన ‘ఉమెన్స్ డే మార్చ్’ కు ఆమె గౌరవ అతిథిగా హాజరైంది. నగరంలోని రాజరత్నం గ్రౌండ్స్ నుంచి నుంగంబాక్కం వరకు 5 కిలోమీటర్ల […]

మహిళా ! మేలుకో ! ఉమెన్స్ డే నాడు చెన్నైలో మెరిసిన లేడీ సూపర్ స్టార్
Follow us on

సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్లకు, ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సారి మాత్రం తన ఈ ‘సంప్రదాయానికి ‘స్వస్తి’ పలికింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరైంది. ఆదాయం పన్ను శాఖ, ఓ సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా నగరంలో  నిర్వహించిన ‘ఉమెన్స్ డే మార్చ్’ కు ఆమె గౌరవ అతిథిగా హాజరైంది. నగరంలోని రాజరత్నం గ్రౌండ్స్ నుంచి నుంగంబాక్కం వరకు 5 కిలోమీటర్ల మేర సాగిన కాలేజీ విద్యార్థుల ‘వాకథాన్’ కార్యక్రమానికి వఛ్చిన నయన్..స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో ఈ లేడీ సూపర్ స్టార్ ఫోటోలు వెల్లువెత్తాయి. అవార్డు షో లతో బాటు గత పదేళ్లుగా ఎలాంటి ఈవెంట్లకు ఈమె హాజరైంది లేదు. అందుకే ఈ సారి ఇలా పబ్లిక్ లో ప్రత్యక్షమయ్యేటప్పటికీ అందరి ఆశ్చర్యానికి అంతేలేకపోయింది. అయితే ఈ వాకథాన్ కార్యక్రమాన్ని ఇన్ కమ్ టాక్స్ విభాగం నిర్వహించడం, పని గట్టుకుని ఈ అమ్మడు దీనికి  హాజరు కావడం దేనికి సంకేతాలో అన్న అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. కోలీవుడ్ సెలబ్రిటీల ఇళ్ల మీద ఈ మధ్య ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. హీరో విజయ్ ఇంటిపైన, నిర్మాత అంబు చెలియన్ నివాసం మీద వారు సోదాలు జరిపి లెక్కల్లో చూపని కోట్లాది సొమ్మును గుర్తించారు. మరి.. ఆ ఉదంతానికి, ఈ కార్యక్రమానికి నయన్ హాజరు కావడానికి లింక్ ఉందొ లేదో తెలియదు కానీ.. ఈ సందర్భంలో మాత్రం ఆ ఉదంతాన్ని గుర్తు చేసుకోవలసిందే !