‘ రాహుల్ జీ ! అలా చేస్తే అడవులు ఉండవ్’..

|

Dec 05, 2019 | 4:52 PM

కర్నాటకలోని మైసూరు-కేరళలోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్ మధ్య రైలు సర్వీసులను నడపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ పై పర్యావరణవేత్తలు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఇదే జరిగితే ఈ ప్రాంతాల మధ్య ఉన్న బందిపూర్, నాగర్ హోల్ జాతీయ పార్కులు, అడవులు నాశనమవుతాయని, ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాల్లోని పులులు, ఏనుగులు, ఇతర జంతువులకు తీవ్ర హాని జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (రాహుల్ బుధవారం ఈ మేరకు లోక్ సభలో కేంద్రాన్ని […]

 రాహుల్ జీ ! అలా చేస్తే అడవులు ఉండవ్..
Follow us on

కర్నాటకలోని మైసూరు-కేరళలోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్ మధ్య రైలు సర్వీసులను నడపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ పై పర్యావరణవేత్తలు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఇదే జరిగితే ఈ ప్రాంతాల మధ్య ఉన్న బందిపూర్, నాగర్ హోల్ జాతీయ పార్కులు, అడవులు నాశనమవుతాయని, ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాల్లోని పులులు, ఏనుగులు, ఇతర జంతువులకు తీవ్ర హాని జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (రాహుల్ బుధవారం ఈ మేరకు లోక్ సభలో కేంద్రాన్ని కోరారు). గతంలో కూడా ఆయన దాదాపు ఇలాంటి డిమాండ్ తో పర్యావరణవేత్తల ఆగ్రహాన్ని చవి చూశాడు. కేరళ వాణిజ్య ప్రయోజనాలకు అనువుగా బందిపూర్ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో రాత్రివేళల్లో అమలు చేస్తున్న నిషేధాన్ని ఎత్తివేయాలని కూడా రాహుల్ అభ్యర్థించారు. అయితే..మైసూరు, వయనాడ్ మధ్య రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదన ఆత్మహత్యా సదృశమని అటవీ శాఖ మాజీ ముఖ్య అధికారి, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ అయిన బీ.కె. సింగ్ అన్నారు. ఇలా చేస్తే అటవీ ప్రాంతంతో బాటు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పారు. పైగా ఆ ప్రాంతాల ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసివస్తుందన్నారు.
ముదుమలై-బందిపూర్-నాగర్ హోల్-వయనాడ్ మధ్యగల అటవీ ప్రాంతాల్లో జంతువుల ఉనికి నామరూపాల్లేకుండా పోతుందని, అందువల్ల ఈ విధమైన డిమాండ్ సహేతుకం కాదని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అధికారి ప్రవీణ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా దేశంలో ఇన్ని సమస్యలుండగా రాహుల్.. ఈ వింత కోర్కె కోరడంలో అర్థం లేదని అంటున్నవారూ ఉన్నారు.