ముంబైలో ఆగని కరోనా విలయం.. ఒక్కరోజులో 218 కేసులు నమోదు

| Edited By: Anil kumar poka

Apr 11, 2020 | 12:05 PM

దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత 24 గంటల్లో 218 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క సిటీలోనే ఈ కేసుల సంఖ్య 993 కి చేరుకుంది. పది మంది రోగులు మరణించారు.

ముంబైలో ఆగని కరోనా విలయం.. ఒక్కరోజులో 218 కేసులు నమోదు
Follow us on

దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత 24 గంటల్లో 218 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క సిటీలోనే ఈ కేసుల సంఖ్య 993 కి చేరుకుంది. పది మంది రోగులు మరణించారు. ధారవి మురికివాడలో 11 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు ఇటీవల ఢిల్లీలో జరిగిన జమాత్ నిజాముద్దీన్ మత పర కార్యక్రమానికి హాజరై వఛ్చిన వారే. ఆశ్చర్యకరంగా ఈ మురికివాడలో కరోనాకు గురైనవారిలో ఓ డాక్టర్ భార్య ఉండడం గమనార్హం. ఈ స్లమ్ వద్ద గల పోలీసు స్టేషన్ సమీపంలో శానిటైషన్ టెంటును అధికారులు ఏర్పాటు చేశారు. ఆ దారిన గుండా వెళ్లే వారిపై డిస్ ఇన్ ఫిక్టెంట్ మందును స్ప్రే చల్లుతున్నట్టు స్థానికులు తెలిపారు. దేశంలో తాజాగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.