‘టిక్ టాక్ ‘ తరఫున వాదించదలచుకోలేదు’.. ముకుల్ రోహ్తగి

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2020 | 6:14 PM

ప్రభుత్వం బ్యాన్ చేసిన టిక్ టాక్ తరఫున గానీ, మరే  ఇతర చైనీస్ యాప్ ల తరఫునగానీ తాను సుప్రీంకోర్టులో వాదించదలచుకోలేదని మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ కూడా..

టిక్ టాక్  తరఫున వాదించదలచుకోలేదు.. ముకుల్ రోహ్తగి
Follow us on

ప్రభుత్వం బ్యాన్ చేసిన టిక్ టాక్ తరఫున గానీ, మరే  ఇతర చైనీస్ యాప్ ల తరఫునగానీ తాను సుప్రీంకోర్టులో వాదించదలచుకోలేదని మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ కూడా అయిన ముకుల్ రోహ్తగి వెల్లడించారు. టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్ ల మీద ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. కాగా ఈ బ్యాన్ తాత్కాలికమేనని, సంబంధిత అధినేతలు తమ వివరణను ఇచ్చుకునేందుకు అవకాశం ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అటు-ఈ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటామని, తమ క్లారిటీని స్పష్టం చేసేందుకు ప్రభుత్వ వాటాదారులతోను, ఆయా ఏజన్సీలతోను సంప్రదింపులు జరుపుతామని టిక్ టాక్ యాజమాన్యం తెలిపింది. ఇలా ఉండగా.. ఈ యాప్ సహా ఇతర చైనీస్ యాప్ లపై సర్కార్ నిషేధం విధించడం పట్ల పలువురు సెలబ్రిటీలు, విద్యావేత్తలు, ఆర్టిస్టులు, ఇతర రంగాల వారు లోలోన అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ..   చైనా సేనల దాడిలో 20 మంది భారత సైనికులు మరణించడంతో.. ఈ బ్యాన్ సరైన చర్యే అని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సైనిక స్థాయిలో జరుగుతున్న చర్చలు నామమాత్రంగా సాగుతున్నాయి.