కోవిడ్ భయం ఉన్నా ఇక హరిద్వార్ లో లక్షలాది భక్తులతో కుంభమేళా, పోటెత్తనున్న యాత్రికులు, గంగానదిలో పవిత్ర స్నానాలు

| Edited By: Ravi Kiran

Jan 29, 2021 | 1:10 PM

కోవిడ్ భయం దేశాన్ని ఇంకా వీడలేదు. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు.

కోవిడ్ భయం ఉన్నా ఇక హరిద్వార్ లో లక్షలాది భక్తులతో కుంభమేళా, పోటెత్తనున్న యాత్రికులు, గంగానదిలో పవిత్ర స్నానాలు
Follow us on

కోవిడ్ భయం దేశాన్ని ఇంకా వీడలేదు. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు. యూఎస్ తరువాత ఈ మహమ్మారితో సతమతమవుతున్న రెండో దేశంగా ఇండియా నిలుస్తోంది. అయితే హరిద్వార్ లో గురువారం నుంచి కుంభ్ మేళా  ఆరంభమవుతోంది. లక్షలాది భక్తులు, యాత్రికులతో కిటకిటలాడబోతోంది. బుధవారం నాడే వేల భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. రోజురోజుకీ భక్తుల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయని కుంభమేళా ట్రస్ట్ ఆర్గనైజర్ సిధ్ధార్థ చక్రపాణి తెలిపారు. ఇది పది లక్షలకు పైగా పెరిగినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని, ఈ కరోనా తరుణంలో అత్యంత అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచేగాక విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు హరిద్వార్ ను విజిట్ చేయనున్నారు.