ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఇక లాఠీలకు బదులు మెటల్ రాడ్స్, నిజమేనా?ధృవీకరించని అధికారులు

| Edited By: Anil kumar poka

Feb 01, 2021 | 5:19 PM

ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఇక లాఠీలకు బదులు పొడవాటి మెటల్ రాడ్స్ కనిపించనున్నాయి. సింఘు బోర్డర్లో గత వారం తమతో ఘర్షణలకు దిగిన రైతులను...

ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఇక లాఠీలకు బదులు మెటల్ రాడ్స్,  నిజమేనా?ధృవీకరించని అధికారులు
Follow us on

ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఇక లాఠీలకు బదులు పొడవాటి మెటల్ రాడ్స్ కనిపించనున్నాయి. సింఘు బోర్డర్లో గత వారం తమతో ఘర్షణలకు దిగిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించగా ఓ రైతు తన చేతిలోని పొడవాటి కత్తితో ఓ పోలీసు అధికారిపై దాడి చేసి గాయపరిచాడు.  ఈ నేపథ్యంలో ఇకపై ఈ విధమైన అల్లర్లలో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులకు ఈ విధమైన లోహపు రాడ్ లను, మణికట్టు నుంచి మోచేతివరకు కవర్ చేసిన  మెటల్ గ్లోవ్ లను ఇవ్వనున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను పోలీసు వర్గాలు షేర్ చేశాయి. అయితే నిజంగా ఇలాంటి ఆయుధాలను వీరికి సమకూర్చారా అన్న విషయాన్ని పోలీసుఅధికారులు  ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

గత మంగళవారం రిపబ్లిక్ డే నాడు కూడా అనేకమంది రైతులు చేతుల్లో పొడవాటి కత్తులు పట్టుకుని ఎర్రకోట వద్ద ఉద్రిక్తతను సృష్టించారు. ఆ ఘర్షణల్లో కూడా ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.

Read More:ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 6,18,399 కేసులు, 10,178 మరణాలు..