‘బండారం బయట పడుతుందా’? కోర్టు కెక్కిన మెహుల్ చోక్సీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2020 | 4:49 PM

ఇండియాలో బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు  చెక్కేసిన 'బ్యాడ్ బాయ్స్' పై  నెట్  ఫ్లిక్స్ రూపొందించిన ఓ సిరీస్ మీద 'ఫ్యుజిటివ్ డైమండ్ మర్చంట్' మెహుల్ చోక్సీ..

బండారం బయట పడుతుందా? కోర్టు కెక్కిన మెహుల్ చోక్సీ
Follow us on

ఇండియాలో బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు  చెక్కేసిన ‘బ్యాడ్ బాయ్స్’ పై  నెట్  ఫ్లిక్స్ రూపొందించిన ఓ సిరీస్ మీద ‘ఫ్యుజిటివ్ డైమండ్ మర్చంట్’ మెహుల్ చోక్సీ ఒకటే ‘కంగారు పడుతున్నారు’. ‘బ్యాడ్ బాయ్స్’ బిలియనీర్స్ ‘ పేరిట ఈ సిరీస్ సెప్టెంబర్ 2 న ప్రసారం కానుంది.  అయితే  దీని విడుదలకు ముందు  దీన్ని తాము చూడవలసి ఉందని మెహుల్ చోక్సీ కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో తన లాయర్ ద్వారా అప్పీలు దాఖలు చేశాడు. ఇండియాలో బోలెడంత అపఖ్యాతి మూట గట్టుకున్న (ఇన్ ఫేమస్ టైకూన్స్) విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, ఆయన సమీప బంధువు నీరవ్ మోడీ వంటి ఫ్రాడ్ స్టర్స్ ని ఈ సిరీస్ హైలైట్ చేస్తోంది. కానీ ఇది ప్రసారం కాకముందే తాము దీన్ని చూడవలసి ఉందని, ఫ్రాడ్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు మీద ఇది ప్రభావం చూపుతుందని చోక్సీ తరఫు లాయర్ పేర్కొన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసుకు సంబంధించి రూ. 13,500 కోట్ల నిధుల గోల్ మాల్ లో చోక్సీ, నీరవ్ మోడీ నిందితులన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాంటిగ్వా లో తలదాచుకున్న చోక్సీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది. ఈ నెల 28 న ఈ అప్పీలుపై విచారణ జరగాలని కోర్టు నిర్ణయించింది.