ఉగ్రవాది హఫీజ్ సయీద్ చుట్టూ మరింత బిగుస్తున్న ఉచ్ఛు

|

Dec 11, 2019 | 3:47 PM

2008 లో ముంబై టెర్రర్ ఎటాక్ సూత్రధారి హఫీజ్ సయీద్ పై పాకిస్థానీ కోర్టు మరో అభియోగం మోపింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నాడని అంటూ ఇతడిని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. (ఒక విధంగా అభిశంసించింది). టెర్రర్ ఫైనాన్సింగ్ ను అరికట్టడంలో విఫలమైన పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలా అన్న విషయమై ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ అనే వాచ్ డాగ్ వచ్ఛే ఏడాది నిర్ణయం తీసుకోనుంది. ఆ సమావేశానికి […]

ఉగ్రవాది హఫీజ్ సయీద్ చుట్టూ మరింత బిగుస్తున్న ఉచ్ఛు
Follow us on

2008 లో ముంబై టెర్రర్ ఎటాక్ సూత్రధారి హఫీజ్ సయీద్ పై పాకిస్థానీ కోర్టు మరో అభియోగం మోపింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నాడని అంటూ ఇతడిని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. (ఒక విధంగా అభిశంసించింది). టెర్రర్ ఫైనాన్సింగ్ ను అరికట్టడంలో విఫలమైన పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలా అన్న విషయమై ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ అనే వాచ్ డాగ్ వచ్ఛే ఏడాది నిర్ణయం తీసుకోనుంది. ఆ సమావేశానికి ముందు సయీద్ పై కోర్టు ఇలాంటి నేరాభియోగం మోపడం విశేషం. మంగళవారం ఇతడిని యాంటీ టెర్రరిజం కోర్టులో హాజరు పరిచినప్పుడు అతని నేరాలను అధికారులు చదివి వినిపించారు. ఇతనిపైన, ఇతని సహచరులపైన పాక్ పోలీసు విభాగంలోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ జులై 17 న 23 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసింది. వీరంతా పంజాబ్ ప్రావిన్స్ లోని వివిధ నగరాలు, ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నారని ఆరోపణలను మోపింది. ఆ రోజున వీరిని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కోట్ లఖ్ పత్ జైల్లో హఫీద్ సయీద్ శిక్ష అనుభవిస్తున్నాడు.
ట్రస్టులు, లాభాపేక్ష లేని సంస్థల పేరిట సయీద్ ఆస్తులు కొని.. వాటి అమ్మకాల ద్వారా నిధులు సేకరిస్తున్నాడట. ఈ మేరకు లాహోర్, గుర్జన్ వాలా, ముల్తాన్ లలో కేసులు నమోదయ్యాయి.
అయితే సయీద్ స్వేఛ్చగా బయట తిరుగుతున్నాడని, పాకిస్థాన్ ‘ గౌరవ మర్యాదలను ‘ పొందుతున్నాడని ఇండియా గతవారమే పేర్కొంది. ఇతడిపై చర్యలు తీసుకోవలసిన బాధ్యత పాక్ ప్రభుత్వానిదేనని, ఇతని ‘ నిర్వాకాల ఆధారాలు ‘ తమ వద్ద ఉన్నాయని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఈ ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందజేశామని కూడా ఆయన చెప్పారు. సయీద్, మరో ఉగ్రవాది మాలిక్ జాఫర్ ఇక్బాల్ లపై డిసెంబరు 11 న అభియోగాలు మోపుతామని పాక్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు గతంలో ప్రకటించింది.