ఢిల్లీలో ఇక పరుగులు తీయనున్న మెట్రో రైళ్లు

| Edited By: Pardhasaradhi Peri

Aug 30, 2020 | 12:47 PM

ఢిల్లీలో మళ్ళీ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఆరు నెలల విరామం అనంతరం మెట్రో ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఆదివారం ఢిల్లీ మెట్రో అధికారులు కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తూ..

ఢిల్లీలో ఇక పరుగులు తీయనున్న మెట్రో రైళ్లు
Follow us on

ఢిల్లీలో మళ్ళీ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఆరు నెలల విరామం అనంతరం మెట్రో ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఆదివారం ఢిల్లీ మెట్రో అధికారులు కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తూ.. మాస్కులు, స్మార్ట్ కార్డులను తప్పనిసరి అని స్పష్టం చేశారు. అయితే టోకెన్లపై నిషేధం కొనసాగుతుంది. ప్రతి కోచ్ లోను పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తారు. కానీ  ఈ సంఖ్యపై ఇంకా క్లారిటీ లేదు బహుశా రేపో, మాపో స్పష్ఠత రావచ్చునని భావిస్తున్నారు. కాగా-ప్రతి రైల్వే స్టేషన్లలోనూ రైళ్లు ఆగబోవని, దశలవారీగా ఈ స్టేషన్లను అనుమతిస్తామని ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.

ఢిల్లీ నగరంలో కరోనా వైరస్ చాలావరకు  అదుపులోకి వచ్చింది గనుక ఇక మెట్రో సర్వీసులను అనుమతించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు ఆదివారం ఈ కొత్త మార్గదర్శక సూత్రాలు విడుదలయ్యాయి.