మిడతల దండు వస్తోంది… పారా హుషార్ ! హర్యానా సర్కార్ హెచ్ఛరిక

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 12:13 PM

మిడతల దండుతో ముప్పు ముంచుకురానుందని, బీ కేర్ ఫుల్ అని హెచ్ఛరిస్తోంది హర్యానా ప్రభుత్వం ! గుర్ గావ్, మహేంద్ర గడ్ వంటి జిల్లాల్లో అప్పుడే ఈ బెడద ప్రారంభమైందని, దీని నివారణకు ప్రజలు తమ ఇళ్ల కిటికీలను..

మిడతల దండు వస్తోంది... పారా హుషార్ ! హర్యానా సర్కార్ హెచ్ఛరిక
Follow us on

మిడతల దండుతో ముప్పు ముంచుకురానుందని, బీ కేర్ ఫుల్ అని హెచ్ఛరిస్తోంది హర్యానా ప్రభుత్వం ! గుర్ గావ్, మహేంద్ర గడ్ వంటి జిల్లాల్లో అప్పుడే ఈ బెడద ప్రారంభమైందని, దీని నివారణకు ప్రజలు తమ ఇళ్ల కిటికీలను మూసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. పైగా టిఫిన్ బాక్సులు, పళ్ళాలపై శబ్దాలు చేస్తూ ఉండాలని కూడా వారు సలహా ఇచ్చారు. ఇలా చేస్తే అవి ఇళ్లు , పొలాలపై పడకుండా.. ఒకే చోట ‘సెటిలవుతాయట’ ! అలాగే రైతులు కూడా క్రిమి సంహారక మందులను చల్లే తమ స్ప్రే పంపులను రెడీగా ఉంచుకోవాలని కూడా వారు కోరారు. పలు జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు వీటి నివారణపై అవగాహన కలిగించే చర్యలు చేపట్టాలని హర్యానా ప్రభుత్వం వ్యవసాయ శాఖ సిబ్బందిని  ఆదేశించింది. మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే మిడతల దండ్లు వివిధ గ్రామాల్లోని పంట పొలాలను నాశనం చేశాయి. వీటి నివారణకు  ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం కో-ఆర్డినేట్ చేసేందుకు పదకొండు కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేసింది.  అయితే పెద్దగా ప్రయోజనం లభించిన దాఖలాలు కనబడడం లేదు. హెక్టార్ల కొద్దీ పంటలు నాశనమవుతున్నాయి.