పాల్ఘర్ ఘటన.. కిల్లర్స్ కోసం డ్రోన్లతో గాలింపు

| Edited By: Anil kumar poka

Apr 23, 2020 | 11:37 AM

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇద్దరు సాధువులను, ఒక డ్రైవర్ ను స్థానిక గుంపు కర్రలతో కొట్టి చంపిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ, రాష్ట్ర పోలీసులు దుండగుల ఆచూకీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.

పాల్ఘర్ ఘటన.. కిల్లర్స్ కోసం డ్రోన్లతో గాలింపు
Follow us on

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇద్దరు సాధువులను, ఒక డ్రైవర్ ను స్థానిక గుంపు కర్రలతో కొట్టి చంపిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ, రాష్ట్ర పోలీసులు దుండగుల ఆచూకీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. కిల్లర్స్ ఈ జిల్లాకు దగ్గరలోని గ్రామ సమీపాన గల అడవుల్లో దాక్కుని ఉంటారని భావిస్తున్నారు.  పైగా గ్రామస్థుల కదలికలపై నిఘా పెట్టేందుకు సుమారు 200 మంది పోలీసులను నియమించారు. ఈ నెల 16 న ఇద్దరు సాధువులు, తమ డ్రైవర్ తో ముంబై నుంచి కారులో సూరత్ వెళ్తుండగా.. ఈ గ్రామ సమీపానికి రాగానే.. వీరిని పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించి స్థానికులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 70 ఏళ్ళ సాదువు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది బాలురను జువెనైల్ హోమ్ కి పంపారు.