సుశాంత్ కేసులో ఇక ముంబై పోలీసులది ప్రేక్షక పాత్రే !

| Edited By: Pardhasaradhi Peri

Aug 20, 2020 | 3:51 PM

సుశాంత్ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ముంబై పోలీసులు సీబీఐ అధికారులకు అందజేయనున్నారు. ఇక వారు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయబోరని, కేవలం సీబీఐకి..

సుశాంత్ కేసులో ఇక ముంబై పోలీసులది ప్రేక్షక పాత్రే !
Follow us on

సుశాంత్ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ముంబై పోలీసులు సీబీఐ అధికారులకు అందజేయనున్నారు. ఇక వారు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయబోరని, కేవలం సీబీఐకి సహకరిస్తారని తెలుస్తోంది. ‘వాళ్ళు దర్యాప్తు చేస్తే ఇక మేమెందుకు ? జస్ట్.. వారికి సహకరిస్తాం..అంతే’ అన్న తీరులో ముంబై పోలీసులు ఉన్నారు. ఇక ఈ కేసులో సీబీఐ దర్యాఫ్తునకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన రూలింగ్ పై రివ్యూ పిటిషన్ వేయరాదని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఈ పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం ఉండబోదన్నది ప్రభుత్వ ఆలోచనగా కనబడుతోంది.

ఇక సీబీఐ బృందం గురువారం సాయంత్రం  ముంబై చేరుకొని తమ ఇన్వెస్టిగేషన్ కి శ్రీకారం చుట్టబోతోంది.