మధ్యప్రదేశ్ భవిష్యత్ కి ఉపఎన్నికల ఫలితాలే సూచిక, జ్యోతిరాదిత్య సింధియా

| Edited By: Anil kumar poka

Aug 25, 2020 | 12:40 PM

మధ్యప్రదేశ్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర భవిష్యత్ ని నిర్దేశిస్తాయని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

మధ్యప్రదేశ్ భవిష్యత్ కి ఉపఎన్నికల ఫలితాలే సూచిక, జ్యోతిరాదిత్య సింధియా
Follow us on

మధ్యప్రదేశ్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర భవిష్యత్ ని నిర్దేశిస్తాయని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మీకు ‘బడా చోటా భాయ్ (కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్) కావాలో, ‘త్రిమూర్తి’ (సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తాను, బీజేపీ నేత నరేంద్ర సింగ్ తోమర్) ఎవరు కావాలో నిర్ణయించుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో సుమారు 27 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు జరగవలసి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంతో సహా మరికొన్ని రాష్ట్రాల శాసన సభలకు జరిగే ఎన్నికలకు, , కొన్ని నియోజకవర్గాల  బై పోల్స్ కు జరగవలసి ఉన్న  ఉప ఎన్నికలకు మార్గదర్శక సూత్రాలను రూపొందించే పనిలో  ఎలెక్షన్ కమిషన్ ఉంది.

కాగా మధ్యప్రదేశ్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి మధ్య తేడాను జ్యోతిరాదిత్య సింధియా వివరించారు. ఏయే ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలకు ఎన్నెన్న్ని నిధులు ఖర్చు పెట్టాయో… గ్వాలియర్ లో జరిగిన సభలో ఆయన చెప్పారు.