ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో త్వరలో ‘మద్యం’ గ్లాసుల గలగలలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 20, 2020 | 4:14 PM

ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో త్వరలో లిక్కర్ సరఫరా చేయనున్నారు. లైసెన్స్ ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్ఛు. అయితే ఇంకా బార్లు మాత్రం..

ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో త్వరలో మద్యం గ్లాసుల గలగలలు
Follow us on

ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో త్వరలో లిక్కర్ సరఫరా చేయనున్నారు. లైసెన్స్ ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్ఛు. అయితే ఇంకా బార్లు మాత్రం నగరంలో తెరుచుకోలేదు. ఆదాయం తగ్గిపోతున్న దృష్ట్యా.. హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరాకు అనుమతించవలసిందిగా ఎక్సయిజు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వీటిలోని  టేబుల్స్, గదుల్లో లిక్కర్ గ్లాసుల గలగలలు వినిపించబోతున్నాయి. జూన్ 8 నుంచే తెరచుకునేందుకు నగరంలోని రెస్టారెంట్లకు అనుమతినిచ్చారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలు విధించారు. కానీ వీటిని సడలించిన గత మూడు దశల్లో మద్యం సరఫరాను సర్కార్ అనుమతించలేదు. వినియోగదారులు కేవలం షాపుల నుంచి మద్యాన్ని కొనుక్కుని వెళ్లేందుకే పర్మిషన్ ఇచ్చారు.

ఢిల్లీ ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో మద్యం ప్రియుల్లో సంతోషం ఉరకలెత్తుతోంది. ఇవి ఎప్పుడు అమల్లోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.