కరెంట్ స్తంభంపై..విద్యుత్ తీగల మధ్య చిక్కుకుని విలవిలలాడిన ఎలుగు…..ఎలా రక్షించారంటే …?

| Edited By: Anil kumar poka

Jun 10, 2021 | 3:24 PM

ఎక్కడా లేనట్టు బ్రౌన్ కలర్ ఎలుగుబంటి ఓ కరెంట్ స్తంభం ఎక్కేసి విద్యుత్ తీగల మధ్య చిక్కుకుపోయింది. మళ్ళీ కిందికి దిగి రాలేక నానా పాట్లూ పడింది. విద్యుత్ స్తంభం మీద దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. దాన్ని ఎలా కిందకు దింపాలో....

కరెంట్ స్తంభంపై..విద్యుత్ తీగల మధ్య చిక్కుకుని విలవిలలాడిన ఎలుగు.....ఎలా రక్షించారంటే ...?
Lineman Uses 8 Feet Long Fibre Glass Stick To Save Bear
Follow us on

ఎక్కడా లేనట్టు బ్రౌన్ కలర్ ఎలుగుబంటి ఓ కరెంట్ స్తంభం ఎక్కేసి విద్యుత్ తీగల మధ్య చిక్కుకుపోయింది. మళ్ళీ కిందికి దిగి రాలేక నానా పాట్లూ పడింది. విద్యుత్ స్తంభం మీద దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. దాన్ని ఎలా కిందకు దింపాలో వారికీ తోచలేదు. అసలే అది కరెంట్ పోల్.. పవర్ ఉంటే షాక్ తగిలి అది తీవ్రంగా గాయపడడమో, మరణించడమో జరిగేది.. వారికి ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు, విద్యుత్ శాఖ వారికీ సమాచారం అందజేశారు. ఈ లోగా ఆ స్థంభానికి తాత్కాలికంగా విద్యుత్తును నిలిపివేశారు. పోలీసుల మాట అటుంచి చివరకు కరెంట్ శాఖ వారికి కూడా ఆ ఎలుగును ఎలా కిందికి దింపాలో తెలియలేదు. అయితే ఓ లైన్ మన్ కి మంచి ఐడియా వచ్చింది. అతగాడు 8 అడుగుల పొడవున్న ఫైబర్ గ్లాస్ స్టిక్ తీసుకువచ్చాడు. తాను ఆ స్తంభానికి సమాంతరంగా ఓ నిచ్చెన లాంటిది వేసుకుని ఎక్కి ఆ స్టిక్ నిఆ ఎలుగు వద్ద పెట్టాడు. మొదట అది భయపడినా ఆ తరువాత అసలు సంగతి తెలుసుకున్నట్టు ఉంది. ఆ స్టిక్ ని పట్టుకుని అతి కష్టం మీద కిందకు దిగి పరుగున అడవిలోకి పారిపోయింది. గాయాలేవీ లేకుండా మొత్తానికి ఎలుగు రక్షణ కార్యక్రమం సుఖాంతమైంది. అమెరికా ఆరిజోనా రాష్ట్రంలోని విలాక్స్ టౌన్ లో జరిగిందీ ఈ ఘటన.

వారంలో ఇదే చోట ఈ విధమైన ‘విశేషం’ జరగడం ఇది రెండో సారి అట.. అయినా ఎలుగుబంట్లకు కరెంట్ స్తంభాలు ఎక్కే అలవాటు ఏమిటో అని స్థానికులు విసుక్కుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.

Covid-19 vaccination : టీకా పంపిణీపై సెంట్రల్ స్పెషల్ ఫోకస్ తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.

ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.

Pfizer expands vaccine :12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఫైజర్ వాక్సిన్..చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ పార్రంభం..?(వీడియో)