జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. 20 కేజీల పేలుడు పదార్థాలతో కూడిన తెల్లని హ్యుందాయ్ శాంత్రో కారును జవాన్లు పేల్చివేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబరుతో కూడిన ఈ కారును బుధవారం రాత్రి ఓ చెక్ పాయింట్ వద్ద జవాన్లు నిలిపివేశారు. అయితే బ్యారికేడ్లను ఛేదించుకుని డ్రైవర్ కారును ముందుకు తీసుకువెళ్లబోగా జవాన్లు కాల్పులు జరపడంతో.. డ్రైవర్ కారులోంచి పారిపోయాడు. ఈ దాడి జరగడానికి గల అవకాశాల గురించి తమకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముందే సమాచారం అందిందని, నిన్న సాయంత్రం నుంచే అప్రమత్తంగా ఉన్నామని ఐజీపీ విజయ కుమార్ తెలిపారు. ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. ఈ వాహనాన్ని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ తరువాత పేల్చి వేశారు. ఈ పేలుడుతో చుట్టుపక్కల గల ఇళ్ళు దెబ్బ తిన్నాయి. అయితే ఆ ఇళ్లవారిని ముందుగానే ఖాళీ చేయించినట్టు విజయ కుమార్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 14న ఇదే జిల్లాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
#WATCH J&K: In-situ explosion of the vehicle, which was carrying IED, by Police in Pulwama.
Major incident of vehicle-borne IED explosion was averted by Police, CRPF & Army after Pulwama Police got credible info last night that a terrorist was moving with an explosive-laden car pic.twitter.com/UnUHSYB07C
— ANI (@ANI) May 28, 2020