కోర్టును క్షమాపణ కోరే ప్రసక్తే లేదు , ప్రశాంత్ భూషణ్

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2020 | 3:27 PM

కోర్టు ధిక్కరణ కేసులో తను కోర్టుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ అన్నారు. తన ట్వీట్లను ఉపసంహరించేందుకు కూడా ఆయన నిరాకరించారు. సీజేఐని, సుప్రీంకోర్టును కించపరిచేలా..

కోర్టును క్షమాపణ కోరే ప్రసక్తే లేదు , ప్రశాంత్ భూషణ్
Follow us on

కోర్టు ధిక్కరణ కేసులో తను కోర్టుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ అన్నారు. తన ట్వీట్లను ఉపసంహరించేందుకు కూడా ఆయన నిరాకరించారు. సీజేఐని, సుప్రీంకోర్టును కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైన నేపథ్యంలో.. అపాలజీ చెప్పేందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనకు రెండు మూడు రోజుల గడువునిచ్చింది. ఆ గడువు నేటితో ముగిసింది. అయితే క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరిస్తూ ఆ పని చేస్తే అది తన మనసాక్షిని ధిక్కరించినట్టే అవుతుందన్నారు. మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వాగతిస్తానని కోర్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.