ఏనుగు మృతికి కారకులైనవారికోసం విస్తృత గాలింపు

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 2:50 PM

కేరళలో గర్భస్థ ఏనుగు మృతికి కారకులైన గ్రామస్తుల కోసం గాలింపు ప్రారంభమైంది. పాలక్కాడ్ జిల్లాలో పేలుడు పదార్థాలు కూర్చిన పైన్ యాపిల్ తిని ఈ ఏనుగు తీవ్రంగా గాయపడి..

ఏనుగు మృతికి కారకులైనవారికోసం విస్తృత గాలింపు
Follow us on

కేరళలో గర్భస్థ ఏనుగు మృతికి కారకులైన గ్రామస్తుల కోసం గాలింపు ప్రారంభమైంది. పాలక్కాడ్ జిల్లాలో పేలుడు పదార్థాలు కూర్చిన పైన్ యాపిల్ తిని ఈ ఏనుగు తీవ్రంగా గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాలోని మన్నార్ కడ్ ఫారెస్ట్ డివిజన్ లో జరిగేందీ ఘటన. ఏనుగు మృతికి కారకులైన అజ్ఞాత వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.  ఈ సంఘటనను  దేశవ్యాప్తంగా అనేకమంది ఖండిస్తున్నా.. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన ట్విటర్ లో.. ఈ  అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాహుల్ ఇప్పటివరకు దీనిపై ఎందుకు నోరెత్తలేదని ఆమె ప్రశ్నించారు.