ఎత్తయిన కొండపై విమానాశ్రయం, దుర్ఘటనకు అదే కారణం ?

| Edited By: Ravi Kiran

Aug 08, 2020 | 11:14 AM

కేరళలోని కోళీకోడ్ లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి పలువురు నిపుణులు ఇందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇదివరకటి కాలికట్ (ప్రస్తుత కోజికోడ్) విమానాశ్రయం..

ఎత్తయిన కొండపై విమానాశ్రయం, దుర్ఘటనకు అదే కారణం ?
Follow us on

కేరళలోని కోళీకోడ్ లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి పలువురు నిపుణులు ఇందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇదివరకటి కాలికట్ (ప్రస్తుత కోళీకోడ్) విమానాశ్రయం..విమానాలు దిగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని తొమ్మిదేళ్ల క్రితమే తాను తన నివేదికలో తెలియజేశానని  ఎయిర్ సేఫ్టీ నిపుణుడు, మాజీ పైలట్ కూడా అయిన మోహన్ రంగనాథన్ తెలిపారు. కేరళలోని నాలుగు ఎయిర్ పోర్టుల్లో ఈ విమానాశ్రయమే అతి చిన్నదని ఆయన అన్నారు. పైగా ఎత్తయిన కొండపై ఉన్న ఈ విమానాశ్రయం రన్ వే కూడా చాలా చిన్నదిగా ఉంటుందని, ఈ విమానాశ్రయం కింద రెండు వైపులా సుమారు 200 అడుగుల లోతున లోయలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైనదని తను 9 సంవత్సరాల క్రితమే ఆధారాలతో సహా తన రిపోర్టులో హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీన్ని సురక్షితమైనదిగా ప్రకటించిందని ఆయన అన్నారు. రన్ వే అతి చిన్నది కావడమే కాక, ఇటీవలి భారీ వర్షాలకు అది తీవ్రంగా దెబ్బ తిన్నదని, అంతర్జాతీయ విమాన సంస్థలు తమ విమానాలను ఇక్కడ దింపడాన్ని మానుకున్నాయని రంగనాథన్ వివరించారు.