కాశ్మీరీ నేతల పగటి కలలు, బీజేపీ సెటైర్

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2020 | 12:57 PM

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని పునరుధ్ధరించాలన్న  ప్రాంతీయ పార్టీల నేతల డిమాండును బీజేపీ తొసిపుచ్చింది.  వారు పగటి కలలను..

కాశ్మీరీ నేతల పగటి కలలు, బీజేపీ సెటైర్
Follow us on

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని పునరుధ్ధరించాలన్న  ప్రాంతీయ పార్టీల నేతల డిమాండును బీజేపీ తొసిపుచ్చింది.  వారు పగటి కలలను కంటున్నారని జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా అన్నారు. అది సాధ్యమయ్యే పని కాదన్నారు. వివాదాస్పదమైన 370, 35 ఏ..ఆర్టికల్స్ ‘ద్వేషపూరితమైన అడ్డుగోడలవంటివని’ ఆయన అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్దికి ఇవి తోడ్పడేవి కావని, వీటివల్లే  జమ్మూ కాశ్మీర్ దశాబ్దాల తరబడి వెనుకబడిపోయిందని రైనా పేర్కొన్నారు.

తమ మధ్య విభేదాలు మరచి 370 అధికరణం పునరుధ్ధరణకు అంతా సమిష్టిగా పోరాడాలని ప్రాంతీయ పార్టీల నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయించిన సంగతి విదితమే. కానీ ఉగ్రవాదం, వేర్పాటువాదం పెరిగాయంటే ఈ ఆర్టికల్స్ వల్లేనని రైనా అన్నారు. రాజౌలీ జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.,. ఇప్పటికైనా పగటికలలు కనడం మానాలని ఈ నేతలను కోరారు.