కోవిద్ రోగుల్లో చైతన్యం నింపేందుకు డ్యాన్స్ చేసిన కర్ణాటక ఎమ్మెల్యే, ‘ పదం ‘ కలిపిన భార్య

| Edited By: Phani CH

May 27, 2021 | 4:51 PM

కోవిద్ రోగుల్లో చైతన్యాన్ని నింపేందుకు, వారిలో స్థైర్యాన్ని పెంపొందించేందుకు అక్కడక్కడా డాక్టర్లు వారితో బాటు డ్యాన్స్ చేయడం చూస్తాం.. కానీ ఓ ఎమ్మెల్యే కూడా అలా వారితో పదం కలిపాడంటేనమ్మలేం.

కోవిద్ రోగుల్లో చైతన్యం నింపేందుకు డ్యాన్స్ చేసిన కర్ణాటక ఎమ్మెల్యే,  పదం  కలిపిన భార్య
Karnataka Mla Wife Dance With Covid Positive Patients
Follow us on

కోవిద్ రోగుల్లో చైతన్యాన్ని నింపేందుకు, వారిలో స్థైర్యాన్ని పెంపొందించేందుకు అక్కడక్కడా డాక్టర్లు వారితో బాటు డ్యాన్స్ చేయడం చూస్తాం.. కానీ ఓ ఎమ్మెల్యే కూడా అలా వారితో పదం కలిపాడంటేనమ్మలేం. కానీ ఇది నిజం.. కర్నాటక దావణగెరె జిల్లాలోని ఓ కోవిద్ కేర్ సింటర్ వద్ద ఈ అనిర్వచనీయ దృశ్యం కనిపించింది. హోనాలీ ఎమ్మెల్యే రేణుకాచార్య, ఆయన భార్య సుమ రేణుకాచార్య ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో కోవిద్ రోగుల ఆనందానికి అంతే లేకపోయింది. ఇక్కడి నియతి కోవిద్ కేర్ సెంటర్లో సుమారు 180 మంది కోవిద్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు సెంటర్ లోని పార్క్ వద్దకు చేరుకొని కొన్ని కన్నడ సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. వారితో మరికొందరు కలిశారు. అప్పుడే ఇక్కడికి వచ్చి ఇది చూసిన ఎమ్మెల్యే రేణుకాచార్య తను కూడా వారిలో ఒకడై ఆ పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్న తన భార్యను, ఇతర మహిళలను కూడా ఆహ్వానించాడు. దాంతో సుమ రేణుకాచార్య , ఆమె స్నేహితురాళ్ళు కూడా ఆయనతో పదం కలిపారు. ఈ వీడియో వైరల్ అయింది. ‘డ్యాన్స్ థెరపీ’తో రోగులు మరింత త్వరగా కోలుకుంటారని అంతా నమ్ముతున్న ఈ తరుణంలో ఇది విశేష ఆకర్షణగా మారింది.

బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో నెగెటివ్ వచ్చి డిశ్చార్జ్ కాబోతున్న రోగులతో నిన్న ఓ డాక్టర్ కూడా ఇలాగే వారితో కలిసి నర్తించాడు. ఇలా చేయడం చాలా మంచిదని మానసిక శాస్త్రజ్ఞులు కూడా సూచిస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటివరకు సుమారు 20 లక్షలమంది కోవిద్ నుంచి కోలుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Karthika Deepam: దమ్ము కొడుతూ కనపడిన వంటలక్క.. నెట్టింట వైరల్.. ( వీడియో )

Fruit Vendor Kindness: దానం చేయాలంటే కోటీశ్వ‌రులే అయ్యిండాలా.? అవ‌స‌రం లేదంటున్నాడీ చెన్నై చిరు వ్యాపారి..