డ్రగ్ యూజర్లలో కర్నాటక సినీ నటులు, మ్యూజిషియన్లు

| Edited By: Anil kumar poka

Aug 27, 2020 | 11:45 AM

సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ వ్యవహారం ఇలా బయటకు పొక్కిందో లేదో, అలా కర్నాటక లోనూ దీని 'ప్రతిధ్వనులు వినిపించాయి'.

డ్రగ్ యూజర్లలో కర్నాటక సినీ నటులు, మ్యూజిషియన్లు
Follow us on

సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ వ్యవహారం ఇలా బయటకు పొక్కిందో లేదో, అలా కర్నాటక లోనూ దీని ‘ప్రతిధ్వనులు వినిపించాయి’. ఈ రాష్ట్రంలో అనేకమంది సినీ నటులు, మ్యూజిషియన్లు కూడా డ్రగ్ యూజర్లేనని తేలింది. ఇక్కడ డ్రగ్స్ రాకెట్ గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్  బ్యూరో రట్టు చేసింది. బెంగుళూరులోని ఓ హోటల్లో 145 ఎండీఎంఏ డ్రగ్ పిల్స్ ను, రూ. 2.20 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.అనూప్, ఆర్. రవీంద్రన్, అనీఖా డీ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు సినీ నటులకు, సంగీత దర్శకులకు, విద్యార్థులకు, యువతకు రకరకాల మత్తుమందులను సప్లయ్ చేసేవారని తెలిసిండి. ఇటీవలే రెహమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా , ఇతగాడు.. బిట్స్ కాయిన్స్ పంపితే ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేవాడట.  అధికారులు స్వాధీనం చేసుకున్న మత్తుమందుల్లో నిషిద్ధ డ్రగ్స్ కూడా ఉన్నాయి.