కరోనా వైరస్ కి చికిత్స పొందినా, మళ్ళీ పాజిటివ్ !

| Edited By: Anil kumar poka

Aug 10, 2020 | 1:40 PM

యూపీలోని కాన్పూర్ లో  కోవిడ్ రోగి ఒకరు తన వ్యాధికి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయనను ఈ నెల 3 న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే....

కరోనా వైరస్ కి చికిత్స పొందినా, మళ్ళీ పాజిటివ్ !
Follow us on

యూపీలోని కాన్పూర్ లో  కోవిడ్ రోగి ఒకరు తన వ్యాధికి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయనను ఈ నెల 3 న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం తిరిగి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో.. మళ్ళీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. యూపీలో ఇలా జరగడం ఇదే తొలికేసని, ఒకసారి ట్రీట్ పొందిన తరువాత మళ్ళీ వైరస్ తిరగబెట్టడం అరుదని వారన్నారు. అయితే స్పెషల్ కేసు కింద దీన్ని పరిగణించి ఈ రోగికి తిరిగి అన్ని పరీక్షలూ చేస్తామని వారు చెప్పారు.

కాన్పూర్ లో 7500 కరోనా కేసులు నమోదు కాగా-251 మంది కరోనా రోగులు మృతి చెందారు.