ప్చ్… కనికా కపూర్ కి ఐదో సారీ నిరాశే ! మళ్ళీ పాజిటివ్ !

| Edited By: Anil kumar poka

Mar 31, 2020 | 1:32 PM

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి ఐదో సారి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు ఈ ఐదోసారి తప్పకుండా నెగెటివ్ వస్తుందని ఆశించిన ఆమెకు ఆశాభంగమే కలిగింది.

ప్చ్... కనికా కపూర్ కి ఐదో సారీ నిరాశే ! మళ్ళీ పాజిటివ్ !
Follow us on

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి ఐదో సారి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు ఈ ఐదోసారి తప్పకుండా నెగెటివ్ వస్తుందని ఆశించిన ఆమెకు ఆశాభంగమే కలిగింది. కరోనా రోగులకు ప్రతి 48 గంటలకూ ఒకసారి టెస్ట్ చేస్తామని లక్నోలో ఈ సింగర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. తనకు నెగెటివ్ అని రిపోర్టు రాగానే.. వెంటనే ఇంటికి వెళ్లి తన పిల్లలను, తన కుటుంబాన్ని కలుసుకోవాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నానని కనికా నిన్న ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె లక్నోలో గల సంజయ్ గాంధీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.