కంగనా ముంబైకి తిరిగి రాగానే హోమ్ క్వారంటైన్ కి !

| Edited By: Anil kumar poka

Sep 07, 2020 | 8:55 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైకి తిరిగి రాగానే ఆమెను వారం రోజులపాటు హోమ్ క్వారంటైన్ కి పంపుతామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. చూడబోతే ఇది బలవంతపు ' ప్రక్రియ' గా కనబడుతోంది.

కంగనా ముంబైకి తిరిగి రాగానే హోమ్ క్వారంటైన్ కి !
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైకి తిరిగి రాగానే ఆమెను వారం రోజులపాటు హోమ్ క్వారంటైన్ కి పంపుతామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. చూడబోతే ఇది బలవంతపు ‘ ప్రక్రియ’ గా కనబడుతోంది. సిటీలోని తన ఆఫీసుపై అధికారులు దాడి చేశారని కంగనా ఆరోపించి ట్వీట్లు చేసిన కొన్ని గంటలకు కార్పొరేషన్ సిబ్బంది ఈ ప్రకటన చేయడం విశేషం. ఆమె ఎల్లుండి ముంబైకి చేరుకోవాల్సి ఉంది. అటు-శివసేన నేత సంజయ్ రౌత్ సోమవారం ఎలాంటి ప్రకటన చేయక పోవడం గమనార్హం. ప్రభుత్వ వర్గాల సూచన మేరకే ఆయన కామ్ గా ఉండిపోయారని తెలుస్తోంది.