ఎంజీఆర్‌ కలలను నెరవేర్చగలిగితే ఆయన వారసుడిని తానే అవుతానంటున్న కమల్‌హాసస్‌

| Edited By: Ram Naramaneni

Dec 17, 2020 | 10:37 AM

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తమిళనాడులో పొలిటికల్‌ టెంపరేచర్‌ మామూలుగా ఉండటం లేదు.. మేజర్‌ పార్టీలలో లేనంత కదలిక సినీ పరిశ్రమలో కనిపించడం విశేషం.. కమలహాసన్‌ ఆల్‌రెడీ మక్కల్‌ నీది మయ్యం పేరుతో పార్టీ పెట్టేశారు..

ఎంజీఆర్‌ కలలను నెరవేర్చగలిగితే ఆయన వారసుడిని తానే అవుతానంటున్న కమల్‌హాసస్‌
Kamal Haasan/File Photo
Follow us on

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తమిళనాడులో పొలిటికల్‌ టెంపరేచర్‌ మామూలుగా ఉండటం లేదు.. మేజర్‌ పార్టీలలో లేనంత కదలిక సినీ పరిశ్రమలో కనిపించడం విశేషం.. కమలహాసన్‌ ఆల్‌రెడీ మక్కల్‌ నీది మయ్యం పేరుతో పార్టీ పెట్టేశారు.. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసింది కూడా! ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నది.. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసింది. ప్రచారరంగంలో కమల్‌ దూకేశారు.. ఆయన తిరునల్వేలి, కన్యాకుమారి విద్యార్థులు, యువత, మహిళానేతలతో సమావేశం అయ్యారు. తాను దివంగత ఎంజీఆర్‌ కలలను సాకారం చేస్తానంటున్నారు కమల్‌.. రజనీకాంత్‌ సిద్ధాంతాలు, తన సిద్ధాంతాలు వేరు వేరని అంటున్న కమల్‌ తామిద్దరం మంచి మిత్రులమని చెప్పుకొచ్చారు. రాజకీయాలలో తమ సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయన్నది ఇప్పుడు చెప్పలేనని, రాబోయే రోజుల్లో రజనీ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని కమల్‌ అన్నారు. రజనీకి తాను బహిరంగంగానే ఆహ్వానం పలికానని, ఇప్పుడు కూడా పిలుస్తున్నానని చెప్పారు. మక్కల్‌ నీది మయ్యం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కమల్‌ వివరించారు. ఒకవేళ ఎంజీఆర్‌ కలను నెరవేర్చగలిగితే ఆ గొప్పనేతకు తానే వారసుడిని కాగలుతానని తెలిపారు. టార్చ్‌లైట్‌ గుర్తు కోసం మక్కల్‌ నీది మయ్యం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించడానికి సిద్ధంగా ఉందని కమల్‌ పేర్కొన్నారు. సినిమావాళ్లు రాజకీయపార్టీలు పెడుతుండటం చూస్తే తనకు కూడా పార్టీ పెట్టాలని అనిపిస్తున్నదని నటుడు పార్ధిబన్‌ అన్నారు. విజయ్‌ కూడా పార్టీ పెడతారేమోనని చెప్పారు. భవిష్యత్తులో తాను పార్టీ పెడితే దానిపేరు పుదియపాదైగా ఉంటుందని ప్రకటించారు.. అంతా చెప్పి తన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దని, కామెడీగా అన్నానని పార్ధిపన్‌ సెలవిచ్చారు.