పంజా విసురుతున్న చలి..ఆవులకు కోట్ల పంపిణీ

|

Nov 25, 2019 | 9:17 PM

గత ఐదారేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఎముకలు కొరికే చలితో జనాలు గజగజా వణికిపోతున్నారు. ఈ యేడు చలికాలం మొదలయ్యిందో లేదో అప్పుడే చలిపులి పంజా నెమ్మదిగా విసరడం మొదలైంది. పల్లెటూర్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో చలి మరింత విజృంభిస్తోంది. చలితీవ్రతకు మనుషులే కాదు, మూగజీవాలు సైతం వణికిపోతున్నాయి. అందుకే అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. సర్కార్‌ ఖజనాతో ఆవులకు చలికోట్లు పంపిణీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ అయోధ్య […]

పంజా విసురుతున్న చలి..ఆవులకు కోట్ల పంపిణీ
Follow us on

గత ఐదారేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఎముకలు కొరికే చలితో జనాలు గజగజా వణికిపోతున్నారు. ఈ యేడు చలికాలం మొదలయ్యిందో లేదో అప్పుడే చలిపులి పంజా నెమ్మదిగా విసరడం మొదలైంది. పల్లెటూర్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో చలి మరింత విజృంభిస్తోంది. చలితీవ్రతకు మనుషులే కాదు, మూగజీవాలు సైతం వణికిపోతున్నాయి. అందుకే అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. సర్కార్‌ ఖజనాతో ఆవులకు చలికోట్లు పంపిణీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.
అయోధ్య నగరంలో ఉన్న ఆవులన్నింటికి చలికోట్లు కుట్టించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌ నీరజ్‌శుక్లా ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం మూడు, నాలుగు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదట బైషింగ్‌పూర్‌ గోశాలలో దీన్ని అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ముందుగా 100 చలికోట్లను పంపిణీ చేస్తామని, మొత్తం గోశాలలోని 1200 పశువులకు చలికోట్లు ఇస్తామని చెప్పారు.  ఒక్కో చలికోటుకు రూ. 250 నుంచి రూ. 300 వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆవుల కోసం రెండు పొరలతో ఉండే కోట్లు, ఇక దూడల కోసం ప్రత్యేకించి మూడు పొరలతో ఉండే చలికోట్లను తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. లోపలి పొరల్లో మృధువుగా ఉండే బట్టను ఉపయోగించాలని తయారీదారులకు సూచించామన్నారు. అలాగే, ఎద్దుల కోసం జనపనారతో తయారు చేయిస్తున్నట్లుగా తెలిపారు. చలికాలం పూర్తయ్యే వరకు గోశాలల వద్ద చలిమంటలు కూడా వేసి ఆవులకు చలి నుంచి రక్షణ కల్పిస్తామని నీరజ్‌శుక్ల స్పష్టం చేశారు.