Jagdeep Dhankhar: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ బాధ్యతలు.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము

|

Aug 11, 2022 | 2:00 PM

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లోని దర్భార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో

Jagdeep Dhankhar: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ బాధ్యతలు.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
Vicepresident Of India
Follow us on

Jagdeep Dhankhar: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లోని దర్భార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆయన పోటీచేసి ప్రత్యర్థి విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఈనెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తికావడంతో గురువారం జగదీప్ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈకార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీ చేపట్టిన తరువాత పలువురు ప్రముఖులు జగదీప్ ధన్ కర్ కు అభినందనలు తెలిపారు. రాజస్థాన్ కు చెందిన జగదీప్ ధన్ కర్ వృత్తిరీత్యా న్యాయవాది.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేడా ఆయన సుప్రీంకోర్టు లాయర్ గా పనిచేశారు. ఎంపీ నుంచి గవర్నర్ గా సేవలందించిన ఆయన తాజాగా ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..