మళ్ళీ అదే వరస ! భారత్-చైనా సైనిక చర్చలు వాయిదా

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2020 | 12:01 PM

భారత-చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కమాండర్ల స్థాయిలో తిరిగి చర్చలు వచ్ఛేవారం జరగనున్నాయి. పాంగంగ్ సో, డెస్పాంగ్ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలన్న భారత సైన్యం అభ్యర్థనను చైనా..

మళ్ళీ అదే వరస ! భారత్-చైనా సైనిక చర్చలు వాయిదా
Follow us on

భారత-చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కమాండర్ల స్థాయిలో తిరిగి చర్చలు వచ్ఛేవారం జరగనున్నాయి. పాంగంగ్ సో, డెస్పాంగ్ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలన్న భారత సైన్యం అభ్యర్థనను చైనా నిరాకరించింది. అరుణాచల్ ప్రదేశ్ వరకు వాస్తవాధీన రేఖ పొడవునా తన దళాలను పెంచాలని పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ చైనా భావిస్తోంది. జులై 14 న జరిగిన నాలుగో దఫా చర్చ,ల సందర్భంగా అంగీకరించిన ప్రతిపాదనలకు కట్టుబడి ఉండాలా అన్న విషయమై చైనా ఇంకా ‘మీనమేషాలు’ లెక్కిస్తూ కాలయాపన చేస్తోందని నిపుణులు ఆరోపిస్తున్నారు.

వచ్చేవారం మళ్ళీ జరగనున్న చర్చల్లో లడాఖ్ తూర్పు ప్రాంతంలో మోహరించిన తన సేనలను వెనక్కి వెళ్లేలా చూడాలని ఇండియన్ ఆర్మీ కోరనుంది. అయితే ఇందుకు కూడా చైనా నిరాకరించవచ్చు.