ఉద్రిక్తతలు తగ్గుముఖం…. భారత-చైనా సరిహద్దుల్లో బఫర్ జోన్స్

| Edited By: Pardhasaradhi Peri

Jul 08, 2020 | 4:30 PM

లద్దాఖ్ లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో రెండు పాయింట్ల వద్ద బఫర్ జోన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. భారత, చైనా దళాలు తొలి దశలో భాగంగా డీ-ఎస్కలేషన్ కి శ్రీకారం చుట్టిన..

ఉద్రిక్తతలు తగ్గుముఖం.... భారత-చైనా సరిహద్దుల్లో బఫర్ జోన్స్
Follow us on

లద్దాఖ్ లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో రెండు పాయింట్ల వద్ద బఫర్ జోన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. భారత, చైనా దళాలు తొలి దశలో భాగంగా డీ-ఎస్కలేషన్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇవి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెనక్కి మళ్ళాయి. గాల్వన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద ఎలాంటి సైనిక దళాల ఉనికి లేని బఫర్ జోన్ ఒకటుంది. ఇక్కడే గత జూన్ 15 న ఉభయదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సేనలు వెనక్కి మళ్లుతున్న సందర్భంగా ఏ విధమైన ఘర్షణలు జరగకుండా నివారించేందుకు బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయినంతరం రెండు దేశాల సైనికులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్ పాయింట్ల వద్దకు చేరాల్సి ఉంది. అటు-రెండు దేశాల మధ్య నాలుగో దఫా చర్చలు త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.