అత్యాచారాలు, రేప్ యత్నాల్లో మచ్చుకు కొందరు బీజేపీ నేతలు

| Edited By:

Dec 07, 2019 | 6:01 PM

దిశ రేప్, మర్డర్ దేశాన్ని కుదిపివేయగా.. ఆ ఘోరానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం మళ్ళీ దేశంలో అలజడి సృష్టించింది. దాదాపు అన్ని వర్గాలూ ఈ ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. రేప్, తదితర నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్న నేతల్లో బీజేపీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారట.. వీరిలో సుమారు 20 మంది […]

అత్యాచారాలు, రేప్ యత్నాల్లో మచ్చుకు కొందరు బీజేపీ నేతలు
Follow us on

దిశ రేప్, మర్డర్ దేశాన్ని కుదిపివేయగా.. ఆ ఘోరానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం మళ్ళీ దేశంలో అలజడి సృష్టించింది. దాదాపు అన్ని వర్గాలూ ఈ ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. రేప్, తదితర నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్న నేతల్లో బీజేపీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారట.. వీరిలో సుమారు 20 మంది పేర్లను కూడా ఈ నివేదిక పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే..
ఎం.జె. అక్బర్,
కుల్ దీప్ సెంగార్
విజయ్ జోలీ
చిన్మయానంద
సాక్షి మహారాజ్
రాఘవ్ జీ
ఉమేష్ అగర్వాల్
ప్రేమేందర్ కటారియా
జయేష్ పాటిల్
శాంతీలాల్ సోలంకీ
రవీంద్ర బవంతాదే
డీ. ఎన్. జీవరాజ్
కృష్ణమూర్తి
హెచ్.ఎస్. రావత్
అశోక్ తనేజా
నిహాల్ చందా
హెచ్.హాలప్ప
హమీద్ సదర్
గోవింద్ పరుమలానీ
అశోక్ మక్వానా
ఇలా.. ఇంకా ఎందరో ఉన్నారని ఈ సంస్థ వెల్లడించింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధమైన అభియోగాలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. అయితే ఇక్కడో ‘ తిరకాసు ‘ ఉంది. తమ పార్టీవారిపైనే ఈ ఆరోపణలు రావడంతో.కమలనాథుల్లో కొంతమంది వారికి ‘ బాసట ‘ గా నిలిచారు. వాళ్ళు చేసింది ‘ పెద్ద తప్పు ‘ కాదన్నట్టు వ్యాఖ్యానాలు చేశారు.


ఉదాహరణకు.. యూపీలో జరిగిన కతువా అనే బాలిక రేప్, మర్డర్ కేసులో పాకిస్తాన్ హస్తం ఉందని నందకుమార్ సింగ్ అనే నేత అంటే.. ముగ్గురు పిల్లల తల్లిని ఎవరూ రేప్ చేయలేరని సురేంద్ర సింగ్ అనే ఎమ్మెల్యే అన్నారు. ‘ ఒక్కోసారి ఇలాంటి ఆరోపణలు తప్పని తేలిపోతాయని ‘ సత్యపాల్ సింగ్ వ్యాఖ్యానిస్తే.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చంద్ర ప్రకాష్ గంగ ‘ కితాబిస్తారు.’ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి.. ఈ విధమైన ఘటనలను పబ్లిసిటీ చేయరాదని ఉచిత సలహా పారేస్తారు.
ఇక ఇండియాలో అత్యాచార కేసుల డేటా ఇలా ఉంది.