ఇండియాకు ‘పరాయి దేశాల’ భూభాగాలు అక్కర్లేదు.. నితిన్ గడ్కరీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 14, 2020 | 8:22 PM

మన దేశానికి పాకిస్తాన్ లేదా చైనా దేశాలకు చెందిన అంగుళం భూమి అయినా అక్కర్లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మనకు అన్ని దేశాలతో శాంతి, ప్రేమ, సౌభ్రాత్రం అవసరమని, అందరితో కలిసి పని చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని..

ఇండియాకు పరాయి దేశాల భూభాగాలు అక్కర్లేదు.. నితిన్ గడ్కరీ
Follow us on

మన దేశానికి పాకిస్తాన్ లేదా చైనా దేశాలకు చెందిన అంగుళం భూమి అయినా అక్కర్లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మనకు అన్ని దేశాలతో శాంతి, ప్రేమ, సౌభ్రాత్రం అవసరమని, అందరితో కలిసి పని చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు. అంతర్గత, విదేశీ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని, శాంతిని నెల కొల్పడంలో సఫలీకృతమైందని ఆయన పేర్కొన్నారు. నాగ పూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండడమే  మనం సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ‘స్పాన్సర్’ చేస్తున్న ఉగ్రవాదం నుంచి ఇండియాను కాపాడుకోగలిగామని, అలాగే 1971 లో ఆ దేశంతో జరిగిన యుధ్ధంలో విజయం సాధించడమే గాక.. బంగ్లాదేశ్ లో స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడడానికి తోడ్పడ్డామని నితిన్ గడ్కరీ అన్నారు.