Maharashtra: వామ్మో.. ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు..!.. అంతే కాకుండా..

|

Oct 17, 2022 | 1:40 PM

ప్రేమ అనిర్వచనం. ప్రేమలో ఉంటే గానీ దాని గొప్పదనం ఏంటో తెలియదు. అది ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. మనుషుల మధ్యే కావచ్చు. మూగ జీవాలపైనే కావచ్చు. ప్రేమకున్న శక్తి అలాంటిది మరి. అందుకే ఓ గ్రామానికి..

Maharashtra: వామ్మో.. ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు..!.. అంతే కాకుండా..
Monkeys
Follow us on

ప్రేమ అనిర్వచనం. ప్రేమలో ఉంటే గానీ దాని గొప్పదనం ఏంటో తెలియదు. అది ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. మనుషుల మధ్యే కావచ్చు. మూగ జీవాలపైనే కావచ్చు. ప్రేమకున్న శక్తి అలాంటిది మరి. అందుకే ఓ గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 32 ఎకరాల భూమిని కోతులకు రాసిచ్చారు. నమ్మడం లేదు కదా… ఇది నిజంగా నిజమండి బాబు.. భూమి అనగానే వ్యక్తుల పేరునో లేక సంస్థల పేరునో ఉంటుంది. కానీ, ఇలా జంతువుల పేరుమీదా..! అనుకోకండి. మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వానరాలకు వాటి పేరున ఏకంగా 32 ఎకరాల భూమి ఉంది. జిల్లాలోని ఉప్లా గ్రామంలో ప్రజలు వానరాలను అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అవి ఎప్పుడు ఇంటికి వచ్చినా వాటికి ఆహారం అందిస్తారు. వివాహాల సమయంలో వాటిని ప్రత్యేక అతిథులుగా గౌరవిస్తారు. ఇటీవల గ్రామ పంచాయతీలోని రికార్డులను పరిశీలించగా 32 ఎకరాల భూమి గ్రామంలో నివసించే వానరాల పేరు మీద ఉంది. అయితే ఈ కోతులకు ఇంత ప్రాపర్టీ ఎక్కడ్నుంచి వచ్చిందీ అనేది మిస్టరీగా మారింది.

ఈ విషయమై సర్పంచి బప్పా పడ్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘భూమి కోతులదేనని పత్రాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి. అయితే ఎవరు వీటిని సృష్టించారో తెలియదు. ఈ పత్రాలను ఎప్పుడు రాశారో కూడా తెలియదు’’ అని తెలిపారు. గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ కోతులు భాగంగా ఉండేవని వివరించారు. గతంలో గ్రామంలో వంద వరకు కోతులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పారు.

అయితే.. కోతులకు రాసిచ్చిన ఈ 32 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటిందని, అక్కడ పాడుబడిన ఇల్లు ఉండేదని, ప్రస్తుతం ఆ ఇల్లు కూలిపోయిందని సర్పంచ్ చెప్పారు. గతంలో గ్రామంలో వివాహాలు జరిగేటప్పుడు మొదట వానరాలకు బహుమతులు అందించేవారని, ఆ తర్వాతే పెళ్లి పనులు చేసేవారని సర్పంచ్‌ వివరించారు. ఏది ఏమైనా కోతులపై ఉన్న ప్రేమకు ఆ గ్రామస్థులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..