కాంగ్రెస్ తో దోస్తీయా ? శివసైనికుని మనస్తాపం.. రాజీనామా

|

Nov 27, 2019 | 4:22 PM

మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఇదో వెరైటీ పరిణామం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే కొత్త సీఎం అవుతారన్న ప్రకటన రాగానే.. సేనకు చెందిన రమేష్ సోలంకీ అనే సీనియర్ కార్యకర్త రాజీనామా చేశాడు. ‘ నా జీవితంలోనే అత్యంత హృదయ భారంతో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నా ‘ అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. రాష్ట్రంలో శివసేనకు చెందిన అధినేత ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం అభినందనీయమని, […]

కాంగ్రెస్ తో దోస్తీయా ? శివసైనికుని మనస్తాపం.. రాజీనామా
Follow us on

మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఇదో వెరైటీ పరిణామం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే కొత్త సీఎం అవుతారన్న ప్రకటన రాగానే.. సేనకు చెందిన రమేష్ సోలంకీ అనే సీనియర్ కార్యకర్త రాజీనామా చేశాడు. ‘ నా జీవితంలోనే అత్యంత హృదయ భారంతో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నా ‘ అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. రాష్ట్రంలో శివసేనకు చెందిన అధినేత ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం అభినందనీయమని, కానీ కాంగ్రెస్ పార్టీతో చెలిమి అన్న విషయాన్ని తన అంతరాత్మ అంగీకరించడం లేదని ఆయన అన్నాడు. సేనతో కలిసి ఇక పని చేయాలని భావించడం లేదన్నాడు.బాదాతప్త హృదయంతో నా ‘ పోస్టు ‘ కు రాజీనామా చేస్తున్నా.. నా పార్టీకి, సహ శివసైనికులకు, నా పార్టీ నేతలకు వీడ్కోలు చెబుతున్నా ‘ అని రమేష్ సోలంకీ అన్నాడు. అయితే ఎప్పుడూ బాలాసాహెబ్ శివసైనికునిగా మాత్రం ఉంటానని తెలిపాడు.
మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన మధ్య సిధ్ధాంత పరంగా ఎన్నో తేడాలు, విభేదాలు ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుకోసం సేన.. తన హిందుత్వ సిధ్ధాంతాన్ని వదిలి.. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. అసెంబ్లీలో బల పరీక్షకోసం సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలంతా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసినప్పటి నుంచి రమేష్’ కొండంత విచారంలో ‘ మునిగాడని తెలుస్తోంది. శివసేనతో సుమారు 20 ఏళ్ళకు పైగా అనుబంధం ఉండి ఆ పార్టీ కార్యకర్తగా చురుగ్గా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వఛ్చిన రమేష్.. చివరకు రాజీనామా చేశాడు.