వరద నీటిలో చిక్కుకున్న బాధితుడికి ‘హెలికాప్టరే’ దిక్కు !

| Edited By: Anil kumar poka

Aug 17, 2020 | 12:03 PM

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలతో అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఛత్తీస్ గడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ రాష్ట్రంలోని 'కుటా ఘాట్'  డ్యాం నుంచి  వరదననీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. .

వరద నీటిలో చిక్కుకున్న బాధితుడికి హెలికాప్టరే దిక్కు !
Follow us on

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలతో అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఛత్తీస్ గడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ రాష్ట్రంలోని ‘కుటా ఘాట్’  డ్యాం నుంచి  వరదననీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది.  ఓ వ్యక్తి అక్కడ  చిక్కుకుని పోయాడు. నీటిలో కొట్టుకుని పోకుండా ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. అయితే అంతకంతకు నీటి ప్రవాహం పెరిగిపోతోంది. బయట ఉన్నవారు హాహాకారాలు చేస్తుండగా.. భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్ ఆపద్భాంధవిలా వచ్చింది. అందులోని ఆర్మీ జవాన్లు హెలికాఫ్టర్ నుంచి తాడును కిందికి దించి అతి కష్టం మీద ఆ వ్యక్తిని రక్షించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

భారీ వర్షాల కారణంగా సుక్మా జిల్లాతో సహా అనేక జిల్లాలు సతమతమవుతున్నాయి. గోదావరి,శబరీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.