‘మోదీజీ ! నా ప్రశ్నకు సమాధానమివ్వండి’.. శశిథరూర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 09, 2020 | 6:16 PM

లడాఖ్ లో భారత-చైనా దళాల ఉపసంహరణ..ప్రధాని మోదీని  వ్యంగ్యంగా విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చింది. ' పాత వివాదా'న్ని పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తిరగదోడడానికి ప్రయత్నించారు. నాడు 2013 లో మోదీ గుజరాత్ సీఎంగా..

మోదీజీ ! నా ప్రశ్నకు సమాధానమివ్వండి.. శశిథరూర్
Follow us on

లడాఖ్ లో భారత-చైనా దళాల ఉపసంహరణ..ప్రధాని మోదీని  వ్యంగ్యంగా విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చింది. ‘ పాత వివాదా’న్ని పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తిరగదోడడానికి ప్రయత్నించారు. నాడు 2013 లో మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా.. అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ని ఆయన  గుర్తు చేశారు. భారత భూభాగం నుంచి చైనా దళాలు ఉపసంహరించుకున్నాయని, అయితే భారత ఆర్మీ ఎందుకు వెనక్కి వెళ్లాలని  శశిథరూర్  వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ…. తన ప్రశ్నకు సమాధానమివ్వాలని  కోరారు.  లడాఖ్ లో చైనా సైనికులు వెనక్కి మళ్లారని, కానీ మన సైనికులు ఎందుకు వెళ్లాలని ఆయన అన్నారు. 2013 ఏప్రిల్ లో 50 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటి లదాఖ్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది భారత భూభాగానికి కేవలం 19 కి.మీ. దూరంలో ఉంది. అయితే రెండు దేశాల సేనలూ మే 5 న వెనక్కి మళ్లారు. అప్పుడే బఫర్ జోన్ ఏర్పాటయింది.