‘మా డాడీని ఎలా చుట్టుముట్టారో చూడండి’, రియా చక్రవర్తి

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2020 | 4:11 PM

సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ముంబైలోని తమ ఇంటి కాంపౌండ్ లో తన తండ్రిని మీడియావాళ్లు ఎలా చుట్టుముట్టారో, ఎలా తరుముతున్నారో చూపుతూ వీడియోను..

మా డాడీని ఎలా చుట్టుముట్టారో చూడండి, రియా చక్రవర్తి
Follow us on

సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ముంబైలోని తమ ఇంటి కాంపౌండ్ లో తన తండ్రిని మీడియావాళ్లు ఎలా చుట్టుముట్టారో, ఎలా తరుముతున్నారో చూపుతూ వీడియోను పోస్ట్ చేసింది. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతోంది. ‘ఇది మా బిల్డింగ్ కాంపౌండ్…ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి.. రిటైర్డ్ అధికారి.. ఈడీ, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు సహకరించడానికి మా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నాం.. ఆయనను ఎలా  చుట్టుముట్టారో చూడండి’ అని పేర్కొంది. బహుశా ఇంటి పై అంతస్తులోని కిటికీ నుంచి ఈ వీడియోను తీసినట్టు కనిపిస్తోంది.

తెల్లని షర్ట్, తలపై క్యాప్ ధరించిన వ్యక్తి నల్లని కారు నుంచి దిగేలోగానే అప్పటికే అక్కడ వేచి ఉన్న టీవీ, పత్రికా సిబ్బంది పొలోమంటూ ఆయనను అడ్డుకుని పోటీలు పడుతూ ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నిస్తుండగా ఆయన పరుగులు  తీస్తూ బిల్డింగ్ లోకి ప్రవేశించాల్సి వచ్చింది. తమ ఇంటి వాచ్ మన్ రామ్ , సుమారు  పదేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడని, అతని మీద కూడా దౌర్జన్యం జరిగిందని రియా పేర్కొంది.