భర్తను హత్య చేసినా కుటుంబ పింఛనుకు భార్య అర్హురాలే, పంజాబ్, హర్యానా హైకోర్టు అనూహ్య తీర్పు

| Edited By: Pardhasaradhi Peri

Jan 31, 2021 | 5:06 PM

ఓ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు అరుదైన, అసాధారణ తీర్పునిచ్చింది. తన భర్తను భార్య హత్య చేసినా ఫ్యామిలీ పెన్షన్  పొందడానికి ఆమె అర్హురాలేనని రూలింగ్..

భర్తను హత్య చేసినా కుటుంబ పింఛనుకు భార్య అర్హురాలే, పంజాబ్, హర్యానా హైకోర్టు అనూహ్య తీర్పు
Follow us on

ఓ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు అరుదైన, అసాధారణ తీర్పునిచ్చింది. తన భర్తను భార్య హత్య చేసినా ఫ్యామిలీ పెన్షన్  పొందడానికి ఆమె అర్హురాలేనని రూలింగ్ ఇచ్చింది. ఈ పింఛను అన్నది ఓ సంక్షేమ పథకమని, ప్రభుత్వ ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం చేయడానికి ఉద్దేశించినదని కోర్టు పేర్కొంది. భర్తను చంపిన క్రిమినల్ కేసులో భార్య దోషి అయినా సరే.. ఆమె ఇందుకు అర్హురాలన్నది ఈ తీర్పు ముఖ్యాంశం. హర్యానాకు సంబంధించిన ఓ కేసును  కోర్టు ఈ నెల 25 న విచారించింది. అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ  కోర్టు న్యాయమూర్తులు విచారిస్తూ.. ఈ ఉత్తర్వులను ప్రకటించారు. ఈమె భర్త 2008 లో మరణించాడు. అయితే ఆయనను ఈమె హతమార్చిందంటూ ఓ కేసు నమోదు కాగా 2011 లో  దోషిగా ఈమెను  అప్పటి కోర్టు పేర్కొంది. దీంతో బల్జీత్ కౌర్ కు కుటుంబ పింఛనును హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది.

దీన్ని సవాలు చేస్తూ కౌర్ పంజాబ్, హర్యానాహైకోర్టు కెక్కింది. . ఈమెకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిస్తూ… బకాయిలతో బాటు రెండు నెలల్లోగా ఆమెకు కుటుంబ పింఛను చెల్లించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మహిళ మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఫామిలీ పెన్షన్ కి అర్హురాలేనని మరో ‘వరం’ కూడా ఇచ్చింది.